ఆ యంగ్ హీరోతో ఎఫైర్... స్వయంగా క్లారిటీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ!

యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మపై ఓ రూమర్ ఉంది. టాలీవుడ్ యంగ్ హీరోని ఆమె ప్రేమిస్తున్నారంటూ పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ కథనాలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. 
 

heroine varsha bollamma clarifies on affair with young hero ksr

బెంగుళూరు భామ వర్ష బొల్లమ్మ తెలుగులో వరుస చిత్రాలు చేస్తుంది. 2020లో విడుదలైన 'చూసి చూడంగానే' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆనంద్ దేవరకొండకు జంటగా మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం చిత్రాల్లో నటించింది. ఆమె లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదల కానుంది. 

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన వర్ష బొల్లమ్మ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఊరు పేరు భైరవకోన చిత్రంలో ఆమె ట్రైబల్ లేడీ రోల్ చేశానని అన్నారు. నా పాత్ర పేరు భూమి. ఊరి మొత్తానికి ఒక్కగానొక్క చదువుకున్న అమ్మాయిని. అందంగా, అమాయకంగా కనిపించే ఈ పాత్రలో పవర్, స్ట్రెంగ్త్ ఉన్నాయని వర్ష అన్నారు. 

ఇదే వేదికపై తనపై ఉన్న ఓ పుకారు క్లారిటీ ఇచ్చారు. హీరో బెల్లంకొండ గణేష్ ని వర్ష ప్రేమిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సదరు వార్తల్లో నిజం లేదన్న వర్ష... బెల్లంకొండ గణేష్ ని ప్రేమించడం లేదని చెప్పారు. కాగా బెల్లంకొండ గణేష్-వర్ష బొల్లమ్మ జంటగా స్వాతిముత్యం టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఆ మూవీ చిత్రీకరణలో ప్రేమలో పడ్డారనే టాక్ ఉంది. 

ఇక ఊరు పేరు భైరవకోన చిత్రానికి వి ఐ ఆనంద్ దర్శకుడు. కావ్య థాపర్ మరొక హీరోయిన్. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఒక్క హిట్ అంటూ తపిస్తున్న సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన చిత్రం మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios