Asianet News TeluguAsianet News Telugu

ఆ  ఆరోపణలపై త్రిష సీరియస్... ఏవీ రాజుకు నోటీసులు!


అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు కామెంట్స్ పై సీరియస్ అయిన త్రిష... కొందరు పాపులారిటీ కోసం ఎంతకైనా తెగిస్తారు. ఏవీ రాజుపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాను.

heroine trisha  krishnan files defamation case against av raju ksr
Author
First Published Feb 22, 2024, 1:22 PM IST | Last Updated Feb 22, 2024, 4:15 PM IST

తన ప్రమేయం లేకుండానే త్రిష కొన్ని వివాదాల్లో చిక్కుకుంటుంది. మన్సూర్ అలీ ఖాన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. త్రిషకు మద్దతుగా నిలిచిన పరిశ్రమ మన్సూర్ అలీ ఖాన్ ని తప్పుబట్టారు. ఆ వివాదం మరువక ముందే అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు.వివాదం తెరపైకి వచ్చింది. దీనితో త్రిష అతడికి నోటీసులు పంపింది. తాను 25 లక్షలు తీసుకుని ఒక ఎమ్మెల్యేతో గడిపినట్లు ఏవి రాజు ఆరోపణలు చేసినట్లు త్రిష అతడికి నోటీసులు పంపింది. 

ఈ కామెంట్స్ పై సీరియస్ అయిన త్రిష... కొందరు పాపులారిటీ కోసం ఎంతకైనా తెగిస్తారు. ఏవీ రాజుపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాను. ఈ వివాదం గురించి ఇకపై నా లాయర్లు మాత్రమే మాట్లాడతారు, అన్నారు. చెప్పినట్లే ఏవీ రాజుకు త్రిష నోటీసులు పంపింది. పరువు నష్టం దావా వేసిన త్రిష... కొంత అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. తన ఇమేజ్ కి జరిగిన డ్యామేజ్ కి ప్రతిగా నోటీసులలో పొందు పరచిన అమౌంట్ చెల్లించాలని పేర్కొన్నారు. 

అలాగే ప్రముఖ మీడియా సంస్థల నుండి త్రిష వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా వచ్చిన కథనాలు తొలగించాలని నోటీసులో పొందుపరిచారు. నోటీసులు అందిన 24 గంటల్లో ఏవీ రాజు మీడియా ముఖంగా త్రిషకు క్షమాపణలు చెప్పాలి. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. లేదంటే త్రిష తీసుకునే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు. 

త్రిష పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్టార్ డమ్ అనుభవించారు. టాప్ స్టార్స్ సరసన నటించింది. ఇప్పటికి కూడా త్రిషకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 17 ఏళ్ల అనంతరం త్రిష, చిరంజీవి జంటగా నటిస్తున్నారు. గతంలో వీరు స్టాలిన్ చిత్రానికి జతకట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios