యష్ నిజంగా కెజియఫ్ హీరోయిన్ ను వేధించాడా..? క్లారిటీ ఇచ్చిన శ్రీనిథి శెట్టి.. ఏమన్నదంటే..?
కన్నడ స్టార్ హీరో యష్ తనను వేధించాడు అన్న వార్తలపై స్పందించింది హీరోయిన్ శ్రీనిథి శెట్టి. అసలు విషయాన్ని వివరిస్తూ.. ట్విట్టర్ లో ఓ పెద్ద నోట్ నురిలీజ్ చేసింది హీరోయిన్. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..?

కన్నడ రాక్ స్టార్ యష్.. కెజియఫ్ హీరోయిన్ శ్రీనిథి శెట్టిని వేధించాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తుర వార్తలు వైరల్ అయ్యాయి. ఒక రకంగా కన్నడ ఇండస్ట్రీని కుదిపేశాయి వార్తలు. హీరో యష్ క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తూ.. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో హీరోయిన్ శ్రీనిథి శెట్టి ఈ విషయంలో స్పందించారు. ఈ వార్తలు తనను ఎంతో బాధించాయి అంటున్న హీరోయిన్.. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టి పారేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై క్లారిటీ ఇస్తూ.. ట్విట్టర్ లో నోట్ రిలీజ్ చేసింది శ్రీనిథి శెట్టి.
వైరల్ అవుతున్న విమర్శలపై సమాధానం చెపుతూ.. సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది శ్రీనిథి... యష్ ఒక జెంటిల్‌మన్ .. అతను ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదని పేర్కొంది. శ్రీనిధి శెట్టి తన తాజా సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ…కొంతమంది ఇలా కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పిచ్చి పిచ్చి వదంతులు పుట్టించేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. కాని నేను సోషల్ మీడియాను ప్రేమను పంచే సాధనంగా మాత్రమే వాడుతాను అంటూ సమాధానం ఇచ్చింది బ్యూటీ.
అంతే కాదు..యష్ తో నటించడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.. ఆయనతో నటించేప్పుడు సెట్‌లో నాకెప్పుడూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఆయన ఒక జెంటిల్‌మన్. అతనితో కలిసి నటించడాన్ని ఆస్వాదించాను అని క్లియర్ గా చెప్పింది శ్రీనిధి శెట్టి. ఈరకంగతా రూమర్స్ కు చెక్ పెట్టింది కన్నడ బ్యూటీ. ఈ విషయంలో సోషల్ మీడియా వ్యాప్తంగా రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది.
అయితే సోషల్ మీడియాలో ఈ రూమర్స్ కు కారణం బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు. సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుని.. ట్విట్టర్ బాణాలు వదులుతుంటాడు ఉమర్. ఫేక్ ప్రచారాలు చేసే తాను క్రిటిక్ ని అని, సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకుని ఉమైర్ సంధు అనే వ్యక్తి సోషల్ మీడియాలో హడావిడి చేయడం చూస్తూనే ఉన్నాం. ఇతను రీసెంట్ గా కేజిఎఫ్ హీరో యష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజీఎఫ్ షూటింగ్ లో యష్ పలుమార్లు హీరోయిన్ శ్రీనిధిని వేధింపులకు గురి చేశాడు. ఆమెని ఇబ్బందిపెడుతూనే ఉన్నాడు. ఇకపై యష్ తో శ్రీనిధి నటించకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లు ఇతడు ప్రకటించడం వైరల్ అయింది.
ఇవే కాదు చాలా మంది స్టార్స్ పై రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ.. పాపులారిటీ సాధిస్తున్నాడు ఉమర్. పవన్ కళ్యాణ్ ఉమెనైజర్ అని, చాలా మంది స్టార్ హీరోయిన్లతో అతడికి ఎఫైర్స్ ఉన్నాయని కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత ఇలయదలపతి విజయ్ ని టార్గెట్ చేస్తూ.. విజయ్, కీర్తి సురేష్ మధ్య ఎఫైర్ సాగుతోంది అంటూ సంచలన ప్రకటన చేశాడు. విజయ్ ఆమెకి కార్లు, బంగ్లాలు కూడా కొనిచ్చినట్లు ఏవేవో ప్రచారం చేస్తున్నాడు బాలీవుడ్ సోషల్ మీడియా స్టార్.