టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే వరుస అవకాశాలు సాధిస్తోంది పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల.ఇక ఇప్పుడు మాస్ మహారాజ్ తో సినిమాచేసే ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. తన క్యారెక్రట్ కు డబ్బింగ్ చేయడంలో బిజీగా ఉంది.
పెళ్ళి సందడి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది క్యూట్ బేబీ శ్రీలీలా. ఫస్ట్ సినిమాతో ఫెయిల్యూర్ ఫేస్ చేసినా కాని.. తన టాలెంట్ తో పాటు.. బ్యూటీతో యూత్‌ను తనవైపు తిప్పుకుంది శ్రీలీల. రాకేష్ రోషన్ హీరోగా నటించిన సినిమా గతేడాది దసరాకు విడుదలై పర్వలేదు అనిపించింది. కాని శ్రీలీలకు వరుసగా సినిమా అవకాశాలు మాత్రం తెచ్చిపెట్టింది.
ఫస్ట్ మూవీలోనే తన నటన, అందాల ఆరబోతతో యూత్ కు పిచ్చెక్కించింది బ్యూటీ.. ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీలీలా టాలీవుడ్‌లో తెగ బిజీ అయింది. వరుసగా అవకాశాలు ఆమె గుమ్మం ముందు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. అందులో మాస్‌మహారాజా రవితేజ జోడీగా నటిస్తున్న ధమాకా ఒకటి. ఈ సినిమాకి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఇక అసలు విషయం ఏంటీ అంటే.. రీసెంట్ గా ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు శ్రీలీల డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసింది. కాగా ఈ సినిమా రైటర్ ప్రసన్న కుమార్ శ్రీలీలతో డబ్బింగ్ స్టూడీయోలో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఈ చిత్రంలో శ్రీలీల ప్రణవి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఈమె పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు హీరోయిన్ శ్రీలీల నితిన్-వక్కంతం వంశీ సినిమాలో నటిస్తుంది. ఇక బాలకృష్ణ-అనీల్ రావిపూడి సినిమాలో కూడా బాలకృష్ణకు కూతురుగా నటిస్తుందిని టాక్. వీటితో పాటుగా మంత్రి గాలిజనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటీ డెబ్యూ మూవీలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది శ్రీలీలా.
