బాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్.. తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. కానీ తన అనారోగ్యం, ఇతర కారణాల వలన ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకుంటోంది.

ఈ క్రమంలో ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మహిళలకు స్వేచ్చ, గౌరవం లభిస్తున్నాయని  ప్రస్తుతం అంతా సానుకూలంగా ఉందని స్నేహ ఉల్లాల్ వెల్లడించింది. 

2005 లో సల్మాన్ ఖాన్ తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన సమయంలో పరిస్థితిలు భిన్నమగా ఉండేవని, హీరోయిన్ల పరిస్థితి నరకంగా ఉండేదని చెప్పింది. కానీ ఇప్పుడు అన్ని విషయాల్లో హీరోయిన్లకు గౌరవం లభిస్తుందని చెప్పుకొచ్చింది. ఇక చాలా కాలంగా ఆమె ఆల్ ఇండియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ అవి మిట్టల్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల ఇద్దరూ కలిసి టూర్ కి వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించడానికి మాత్రం అమ్మడు నిరాకరించింది. ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫాం నుండి మంచి సినిమాలు వస్తున్నాయని.. అందుకే నెట్ ఫ్లిక్స్ షోలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించింది.