శృతి హాసన్ చాలా డిఫరెంట్, ఇక ఆమె జీవితం అలా ముగియనుందా?

రిలేషన్ షిప్ కి ఓకే కానీ, పెళ్లంటే మాత్రం భయం అంటుంది శృతి హాసన్. ఆమె కూడా టబు, నగ్మాల వలె ఒంటరిగా మిగిలిపోనుందా? అనే సందేహాలు మొదలవుతున్నాయి. 
 

heroine shruti haasan indirectly hints that she do not want to marry anymore ksr

పలువురు స్టార్ హీరోయిన్స్ వివాహం చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారు. టబు, శోభన, నగ్మా, త్రిష, అనుష్క ఈ లిస్ట్ లో ఉన్నారు. శృతి హాసన్ కూడా ఇదే పంథా ఫాలో కానుందనే సందేహం కలుగుతుంది. పెళ్లంటే భయం అంటూ శృతి హాసన్ కుండబద్దలు కొట్టింది. అందుకు పలు కారణాలు ఉన్నాయట. 
శృతి హాసన్ తాజాగా పెళ్లి పై తన మనసులో మాట బయటపెట్టింది. ప్రేమంటే నాకు ఇష్టం. అలాగే గౌరవం ఉంది. రిలేషన్ లో ఉండేందుకు ఇష్టపడతాను. పెళ్లంటే మాత్రం మనసులో కొంత భయం ఉంది. ఇందుకు నాకు జీవితంలో ఎదురైన అనుభవాలు, చూసిన సంఘటనలు కారణం. అయితే వైవాహిక బంధంలో ఎన్నో ఏళ్లుగా ఆనందంగా ఉన్న జంటలు ఉన్నాయి. అయినప్పటికీ పెళ్లి విషయంలో నా దృష్టి కోణం మారలేదు. అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, అన్నారు. 

కాగా శృతి హాసన్ 15 ఏళ్ల ప్రాయంలో ఉండగా పేరెంట్స్ విడిపోయారట. కమల్ హాసన్ కి భార్య సారికతో మనస్పర్థలు తలెత్తాయట. 2002లో విడాకులు తీసుకున్నారు. తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారని శృతి హాసన్ రోజూ ఆలోచిస్తూ ఉండేదట. పేరెంట్స్ విడాకులు మానసిక వేదనకు గురి చేశాయట. తల్లి సారిక వద్దే శృతి, ఆమె చెల్లెలు అక్షర పెరిగారట. తమను పెంచడం కోసం సారిక చాలా కష్టాలు పడిందట. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, భద్రత ఉండాలని శృతి హాసన్ తెలియజేసింది. 

గతంలో కూడా పెళ్లికి వ్యతిరేకంగా శృతి హాసన్ మాట్లాడింది. సహజీనం చేశాక పెళ్లి చేసుకుందామని ప్రియుడు అడిగితే ఆమెకు నచ్చదట. వద్దని చెబుతుందట. పెళ్లి కావాలని ఒత్తిడి చేస్తే వదిలేస్తుందట. తన మాజీ ప్రియుడు శాంతను కి గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణం ఇదేనట. శృతి హాసన్ ప్రస్తుతం సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఆ మధ్య ఓ ఆన్లైన్ ఛాట్ లో పాల్గొన్న శృతి హాసన్... తాను సింగిల్ అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే శాంతను హజారిక ను వదిలేసినట్లు పరోక్షంగా చెప్పింది. ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను తో మూడేళ్లకు పైగా సహజీవనం చేసింది శృతి హాసన్. 

ముంబైలో ఇద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. అతని సహచర్యాన్ని శృతి హాసన్ చాలా ఎంజాయ్ చేసేది. ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది. అతనితో ఉన్న ప్రతి క్షణాన్ని శృతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఎంతో అన్యోన్యంగా ఉండే శాంతను-శృతి హాసన్ విడిపోయారు. శాంతను కి ముందు శృతి హాసన్ లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో డేటింగ్ చేసింది. దాదాపు వీరు వివాహం చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అతని కోసం శృతి హాసన్ సినిమాలు కూడా మానేసింది. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు.

ఒకరిద్దరు హీరోలతో శృతి హాసన్ డేటింగ్ చేశారనే పుకార్లు ఉన్నాయి. మైఖేల్, శాంతను లతో ప్రేమాయణం సాగించినట్లు శృతి హాసన్ బహిరంగంగా హీరోలతో చేయలేదు. మరి ఆ వార్తల్లో నిజమెంతో తెలియదు. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్స్ కి బ్రేకప్ చెప్పడానికి ప్రధాన కారణం ఒకటేనట. ఆమెకు వివాహం అంటే ఇష్టం ఉందట. ఇక శృతి హాసన్ కెరీర్ పరిశీలిస్తే.. ఫేడ్ అవుట్ దశలో ఆమెకు వరుస హిట్స్ పడ్డాయి. టాలీవుడ్ ఆమెకు కమ్ బ్యాక్ ఇచ్చింది. ఆమె నటించిన క్రాక్, మంచి విజయం సాధించింది. కరోనా ఆంక్షల మధ్య కిక్ మూవీ విడుదలైంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ లో రవితేజ పవర్ఫుల్ పోలీస్ రోల్ లో అదరగొట్టాడు. అనంతరం వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ తో చేసింది. అయితే శృతి హాసన్ ది గెస్ట్ రోల్ మాత్రమే. 

2023 శృతి హాసన్ కి బాగా కలిసొచ్చింది. స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ రావడంతో పాటు అవి విజయాలు సాధించాయి. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాయి. వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. వీరసింహారెడ్డి మూవీ సైతం వంద కోట్లకు పైగా వసూళ్లతో హిట్ స్టేటస్ అందుకుంది. 

దర్శకుడు ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సలార్  వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. సెకండ్ పార్ట్ కోసం ప్రశాంత్ నీల్ అసలు కథ దాచేశాడు. దాంతో సలార్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. సలార్ 2 చేయాల్సి ఉంది. ప్రస్తుతం అడివి షేక్ కి జంటగా డెకాయిట్ మూవీ చేస్తుంది. ఈ మూవీలో మృణాల్ సైతం నటిస్తున్నట్లు సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios