శ్రీవారి సేవలో శ్రియా.. తిరుమల లో సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్

 ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శ‌ర‌ణ్  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Heroine Shriya Saran and Comedian Brahmanandam and Suman Visit Tirumala Temple JMS

ఈమధ్య తిరుమల శ్రీవారి సస్నిధికి  సెలబ్రిటీల తాకిడి ఎక్కువైపోయింది. అటు బాలీవుడ్ నుంచి...ఇటు టాలీవుడ్ నుంచి వరుసగా స్టార్లు తిరుమల దర్శనం చేసుకుంటున్నారు. రీసెంట్ గా కాలినడకన శ్రీవారిని దర్శించుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికాపదుకునే, అంతకు ముందు జాన్వీ కపూర్.. అంతకు ముందు కూడా పలువరు సెలబ్రిటీలు వరుసగా కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకని తరించారు. 

ఇక తాజాగా  ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శ‌ర‌ణ్  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు( జనవరి 21) వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆమెకి స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. అనంత‌రం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుమలలో శ్రీయ తన కుటుంబ సభ్యులతో కలిసి కనిపించడంతో.. అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. చాలామంది భక్తులుఆమెతో సెల్ఫీలుదిగడానికి ఆసక్తి చూపడంతో పాటు పోటీ పడ్డారు. శ్రీయాను వెంబడించి ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించారు. ఇక కెమెగారల కూడా ఒకింత ఆమెను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి శ్రీయా తిరుమలలో కనిపిండంతో ఆమె ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

ఇక ఈరోజు ఒక్క రోజే.. చాలామంది ప్రముఖులు శ్రీవారిణి దర్శించుకున్నారు. అందులో ముఖ్యంగా అంత‌కుముందు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరుడిని దర్శించుకోగా.. స్టార్ యాంకర్ సుమ, ఆమె కుమారుడు రోహన్‌ తో పాటు.. సీనియర్  సింగ‌ర్ సునీత కూడా  స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios