ఆ డైరెక్టర్ పెద్ద సైకో.. నన్ను బెదిరించేవాడు: సంజన

heroine sanjana sensational comments on director
Highlights

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే చాలా మంది ఇక్కడ పరిస్థితుల కారణంగా అసలు ఈ ఫీల్డ్ లోకి ఎందుకు 

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే చాలా మంది ఇక్కడ పరిస్థితుల కారణంగా అసలు ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చామని బాధ పడిపోతుంటారు. తను కూడా దానికి అతీతం కాదని అంటుంది నటి సంజన. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన సంజన ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొంది. ఇందులో తన జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. 

తనకు 17 ఏళ్ల వయసులో ఓ సినిమా ఛాన్స్ రావడంతో నటించడానికి సిద్ధమైందట. ఒక సీన్ లో హీరోకి  ముద్దుపెట్టమని దర్శకుడు అడిగితే తనకు ఇష్టం లేదని.. ఇటువంటి సీన్స్ చేయనని చెబితే అతడు నీ గురించి చేదుగా ప్రచారం చేస్తా.. నీకు కెరీర్ ఉండాలంటే ముద్దు పెట్టు అంటూ బెదిరించేవాడని చెప్పుకొచ్చింది. సినిమా థియేటర్ లో ఆ సీన్ చూసినప్పుడు తన తల్లితండ్రులు ఎంతో ఇబ్బంది పడినట్లు కాలేజ్ లో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. కేవలం ముద్దు సీన్ లోనే కాకుండా కొండపై ఉన్న సన్నని బండ మీద ఆమెను నడవమని చెప్పాడట.

ఏ మాత్రం కాలు స్లిప్ అయినా.. నదిలో పడిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని.. కనీస రక్షణ బాధ్యతలు లేకుండా తనను ఆ సీన్ లో నటింపజేశాడని అటువంటి సైకో డైరెక్టర్ ను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని సంజన వెల్లడించింది. ఇక తన ప్రేమ విషయంపై కూడా బహిరంగంగానే కామెంట్ చేసింది. ''నేను ఒక డాక్టర్ ని ప్రేమిస్తున్నాను. ప్రస్తుతానికి అతనెవరో సస్పెన్స్.. బెంగుళూరులో అతన్ని కలిశాను. చూడగానే ప్రేమించేశాను. మా ప్రేమ వ్యవహారం ఇంట్లో కూడా తెలుసు. మా వాళ్లకు కూడా ఆయన బాగా పరిచయం'' అని చెప్పుకొచ్చింది.   

loader