Asianet News TeluguAsianet News Telugu

సమంతను వదలని ఆ ఇద్దరు దర్శకులు... ముచ్చటగా మూడో ఆఫర్!

ఆ ఇద్దరు దర్శకుల హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది సమంత. ముచ్చటగా మూడో ఆఫర్ ఇచ్చారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ ఆసక్తికర విషయాలు ఏమిటో చూద్దాం... 
 

heroine samantha turned hot favorite to these directors duo ksr
Author
First Published Jun 29, 2024, 7:40 PM IST

సమంత టాలీవుడ్ స్టార్ లేడీ. ఆమెకు ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. కెరీర్ బిగినింగ్ నుండి సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం లో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ హోదా పట్టింది. ఒక దశకు వచ్చాక అన్ని రకాల జోనర్ ట్రై చేసింది.  సమంత నటించి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు యూ టర్న్, ఓ బేబీ మంచి విజయాలు అందుకున్నాయి. ఓ బేబీ అయితే యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ చేరుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. స్టార్ హీరోల పక్కన కమర్షియల్ సినిమాలు చేసిన సమంత..  డిజిటల్ సిరీస్లలో కూడా సత్తా చాటింది. 

సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ రూపొందించారు.  శ్రీలంక తమిళ్ రెబల్ గా సమంత సాహసోపేత పాత్ర చేసింది. రాజ్ అండ్ డీకే సమంతకు సిటాడెల్ సిరీస్లో మరోసారి ఛాన్స్ ఇచ్చారు. వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేశారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ కి ఇది ఇండియన్ వెర్షన్. హనీ బన్నీ అనే టైటిల్ నిర్ణయించారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగా త్వరలో ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. 

కాగా ముచ్చటగా మూడోసారి రాజ్ అండ్ డీకే హీరోయిన్ సమంతకు ఆఫర్ ఇచ్చారని సమాచారం. రాజ్ అండ్ డీకే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సిరీస్  ప్లాన్ చేస్తున్నారట. ఈ సిరీస్లో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తుండగా సమంత హీరోయిన్ అట. ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సిరీస్ కి 'రక్తబీజ్' అనే టైటిల్ నిర్ణయించారట. త్వరలో అధికారిక సమాచారం రానుండగా... ఆల్రెడీ సమంత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందట. ఆమె మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారట. 

ఈ సిరీస్ సమంత కెరీర్ కి మరింత బూస్ట్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఫ్యూచర్ డిజిటల్ కంటెంట్ దే. భవిష్యత్ లో స్టార్ హీరోలు కూడా సిరీస్లు, ఒరిజినల్స్ చేయక తప్పదు. సమంత ఆ దిశగా అడుగులు వేస్తుంది. అలాగే సమంత మా ఇంటి బంగారం టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించింది. ఈ చిత్రానికి ఆమె నిర్మాత కూడాను. దాదాపు  ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న సమంత  తిరిగి బిజీ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios