పోటుగాడు సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ గర్ల్ సాక్షి చౌదరి ఎవరు ఊహించని విధంగా తనకు ఎదురైనా కొన్ని చేదు అనుభవాలను బయటపెట్టింది. ఆఫర్స్ ఇస్తామంటూ తప్ప్పుగా మాట్లాడుతున్నారని ఇంకోసారి తన వద్దకు అలాంటి ప్రపోజల్స్ వస్తే బండారాన్ని బయటపెడతాను అని వార్నింగ్ ఇచ్చింది. 

జేమ్స్ బాండ్ - సెల్ఫీ రాజా వంటి సినిమాల్లో కూడా నటించిన ఈ నార్త్ బ్యూటీ ప్రస్తుతం సువర్ణ సుందరి సినిమాతో బిజీగా ఉంది. ఆ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన దగ్గరకు వస్తోన్న కొందరు అసభ్యంగా వస్తావా ? రేటెంత అని మాట్లాడుతున్నట్లు వివరించారు. 

కొందరు కోటిరూపాయలు ఇస్తే ఒక నైట్ కి వస్తావా అని అఫర్ చేస్తున్నట్లు చెబుతూ.. ఒక నటిని ఇంత దారుణంగా చులకనగా చూడాల్సిన అవసరం లేదని అఫర్ చేసేవాళ్ళు పెద్ద మూర్ఖులని సాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తన దగ్గరకి అలాంటి ఆలోచనతో మరోసారి రావద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తోందట. సువర్ణసుందరి సినిమాతో పాటు సాక్షి నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి.  

Asianet News special

భారీ నష్టాలతో దెబ్బ కొట్టిన రీసెంట్ మూవీస్