జయం, అపరిచితుడు లాంటి చిత్రాల్లో అందంగా, క్యూట్ గా కనిపించిన హీరోయిన్ సదా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
KNOW
కెరీర్ బిగినింగ్ లో సదాకి వరుస హిట్లు
హీరోయిన్ సదా పేరు చెప్పగానే ప్రేక్షకులకు 'వెళ్ళవయ్యా వేళ్ళూ' అంటూ క్యూట్ గా జయం చిత్రంలో చెప్పే డైలాగ్ గుర్తుకు వస్తుంది. జయం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సదా ఏకంగా శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో సదా సౌత్ లో స్టార్ హీరోయిన్ కావడం ఖాయం అని అంతా అనుకున్నారు.
కానీ సదా స్టార్ స్టేటస్ కి అడుగు దూరంలో నిలిచిపోయింది. అపరిచితుడు తర్వాత ఆమె సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోకపోవడంతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డాయి. ఫలితంగా సదా క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సదా దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయింది అనే చెప్పాలి.
సదా కొత్త అవతారం
ఆ మధ్యన సదా బుల్లితెరపై డ్యాన్స్ షోలో జడ్జిగా కూడా మెరిసింది. ఢీ, నీతోనే డ్యాన్స్ లాంటి షోలకు ఆమె జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం సినిమాలని, బుల్లితెరని పూర్తిగా పక్కన పెట్టిన సదా కొత్త అవతారం ఎత్తింది. కెమెరా ముందు ఉండాల్సిన సదా.. కెమెరాని చేతపట్టింది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా ఆమె మారింది.
'సదా గ్రీన్ లైఫ్' అనే యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన సదా.. వైల్డ్ లైఫ్ లో అడవులు, జంతువుల దృశ్యాలు చిత్రీకరిస్తూ వాటిని సోషల్ మీడియాలో, తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తోంది. ఇటీవల సదా ఆఫ్రికా అడవుల్లో స్వయంగా తన నికాన్ కెమెరాలో ఓ సింహాన్ని చిత్రీకరించింది. సదా చిత్రీకరించిన సింహం విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. సింహం స్లోమోషన్ లో నడచి వస్తున్న విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
ఈ వీడియో చూస్తే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీపై సదాకి ఉన్న ఫ్యాషన్ ఏంటో అర్థం అవుతుంది. సదా వీడియో తీసింది ఓలోమిన అనే జాతికి చెందిన సింహాన్ని. ఈ జాతి సింహాలు కెన్యా అడవుల్లో ఉంటాయి.
సదా చేజార్చుకున్న ఆఫర్స్
ఇక సదా విషయానికి వస్తే ఆమె కెరీర్ లో వెనుకబడడానికి ఆమె వదిలేసుకున్న కొన్ని గోల్డెన్స్ ఆఫర్స్ కారణం అని చెప్పొచ్చు. అపరిచితుడు చిత్రంలో నటిస్తున్న టైంలో రజనీకాంత్ చంద్రముఖి చిత్రంలో సదాకి ఛాన్స్ వచ్చింది. జ్యోతిక పాత్రలో ముందుగా సదానే అడిగారు. డేట్స్ కుదరకపోవడంతో ఆ పాత్రని వదులుకోవాల్సి వచ్చింది. అదే చిత్రంలో నయనతార పోషించిన పాత్రకి కూడా సదాకి ఆఫర్ వచ్చిందట. కానీ అపరిచితుడు వల్ల చంద్రముఖి చిత్రాన్ని సదా కోల్పోయింది. శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రంలో కూడా ముందుగా సదాకే ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని సదా రిజెక్ట్ చేసింది. చంద్రముఖి, ఆనంద్ రెండూ సూపర్ హిట్స్ అయ్యాయి.
