నటి రేణూ దేశాయ్ దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు చెప్పారు. అందుకు ప్రత్యేక కారణం ఉంది. సోషల్ మీడియా వేదికగా దర్శకధీరుణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు.
బాహుబలి 1 విడుదలైన దాదాపు దశాబ్దం అవుతుంది. ఆ చిత్రం గురించి చర్చ ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన గౌరవం అందుకుంది. నార్వే దేశంలో గల స్టావెంజర్ థియేటర్లో బాహుబలి ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకి రాజమౌళి, రమా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. బాహుబలి స్టావెంజర్ స్క్రీనింగ్ కి రేణూ దేశాయ్, అకీరా నందన్ కి సైతం ఆహ్వానం లభించిందట. బాహుబలి టీమ్ వారికి ఆ అవకాశం కల్పించారట.
దీంతో సోషల్ మీడియా వేదికగా రాజమౌళితో పాటు నిర్మాత శోభు యార్లగడ్డకు ధన్యవాదాలు తెలిపింది రేణూ దేశాయ్. అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సినిమా ప్రదర్శించడం గొప్ప విషయం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు మీరు సృష్టించిన సినిమా అద్భుతం. మీ గురించి మాటల్లో చెప్పలేను. పదాలు దొరకడం లేదు. బాహుబలి స్టావెంజర్ స్క్రీనింగ్ కి ఆహ్వానించినందుకు రాజమౌళి, శోభు యార్లగడ్డకు నా కృతఙ్ఞతలు. పది నిమిషాలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
కాగా రేణూ దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె త్వరలో టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించనున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ బయోపిక్ లో రేణూ దేశాయ్ కీలక రోల్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్ర టీజర్ అంచనాలు పెంచేసింది. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
