రష్మిక మందాన ఓ క్యూట్ ఫోటో షేర్ చేశారు. ఫ్రెండ్స్ తో పాటు రెస్టారెంట్ కి వెళ్లిన రష్మిక ఇంట్రెస్టింగ్ మేటర్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు.  

కోట్ల సంపాదన ఉన్నా కోరుకున్నది తినలేరు హీరోయిన్స్. ఫిట్నెస్ అండ్ బ్యూటీ కోసం డైటింగ్ చేస్తారు. కొన్నిరకాల ఆహార పదార్థాలు మాత్రమే తింటారు. అయితే వారానికో నెలకో ఓ రోజు తమకు ఇష్టం వచ్చింది లాగించేస్తారు. దాన్నే చీటింగ్ డే అంటారు. చీటింగ్ డే వేళ రష్మిక ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కి వెళతారట. ఆ రోజు రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేసే విషయంలో జరిగే సంగతులు రష్మిక సరదాగా షేర్ చేశారు. చీటింగ్ డే వేళ నచ్చిన రుచికరమైన ఆహారాలు తినేసి నెక్స్ట్ డే నుండి మరలా డైట్ ఫాలో అవుతుందట. ఇక కన్నుకొడుతూ రష్మిక షేర్ చేసిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. 

ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 2023 డిసెంబర్ లో విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదలైన వేర్ ఈజ్ పుష్ప? కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ క్రేజీ సీక్వెల్ పై ఇండియా వైడ్ అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 

View post on Instagram

రష్మిక చేతిలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. రన్బీర్ కపూర్ హీరో కాగా గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతుంది. యానిమల్ ఆగస్టు 11న విడుదల కానుంది. నితిన్ తో ఒక చిత్రం, రైన్ బో టైటిల్ తో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు రష్మిక ఖాతాలో ఉన్నాయి. 

మరోవైపు రష్మిక-విజయ్ దేవరకొండ మధ్య ఎఫైర్ నడుస్తుందనే పుకార్లు ఉన్నాయి. తరచుగా వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. రెండుస్లారు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. విజయ్ దేవరకొండతో ట్రిప్ కి వెళ్లినట్లు ఒప్పుకున్న రష్మిక... మిత్రులతో వెకేషన్ కి వెళితే తప్పేంటని సమాధానం చెప్పింది. మేము మిత్రులం మాత్రమే అని చెబుతున్న ఈ జంట ఏదో ఒక రోజు బాంబు పేల్చే అవకాశం లేకపోలేదు.