నాగార్జున, నానిలు హీరోలుగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'దేవదాస్' అనే సినిమాను రూపొందనిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నాలు హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

నాగార్జున, నానిలు హీరోలుగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'దేవదాస్' అనే సినిమాను రూపొందనిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నాలు హీరోయిన్లుగా కనిపించనున్నారు.

ఈ రోజు చిత్రబృందం సినిమాలో ఇద్దరి హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసింది. హీరో నాని.. రష్మిక పోస్టర్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ''ఫస్ట్ టైం మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే... లోపల ఏదో రింగ్ అయింది పూజగారు... మళ్లీ ఎప్పుడు?'' అని ట్వీట్ చేశాడు.

మరోపక్క రష్మిక.. నాని అపాయింట్మెంట్ అడుగుతూ మరో ట్వీట్ చేసింది. ''డాక్టర్ దాస్ 27వ తేదీన మీ అపాయింట్‌మెంట్ కావాలి. కొన్ని విషయాలను స్పష్టం చేయాలనుకుంటున్నా. సెప్టెంబర్ 27న మీ అభిమానులకు మంచి ట్రీట్‌మెంట్ ఇస్తారని నమ్ముతున్నా.. కాంట్ వెయిట్'' అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Scroll to load tweet…