Rakul Preeth Singh: ఖరీదైన లగ్జరీ కారు కొన్న రకుల్ ప్రీత్ సింగ్... ధర ఎన్ని కొట్లో తెలుసా?
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోన్ కారు ధర మైండ్ బ్లాక్ చేస్తుంది. బెంజ్ హైఎండ్ మోడల్ కారును కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.

స్టార్ హీరోయిన్ గా సూపర్ హిట్స్ లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటిపోయింది. సినిమాకు కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం హిందిలో ఎక్కువ చిత్రాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఖరీదైన కారు సొంతం చేసుకుంది. లగ్జరీ కార్ బ్రాండ్స్ లో ఒకటైన మెర్సిడెజ్ బెంజ్ హైఎండ్ మోడల్ ఆమె కొనుగోలు చేశారు. ఈ కారు ధర ఏకంగా రూ. 3 కోట్లు అని సమాచారం. కేవలం కారుకు అన్ని కోట్లు కుమ్మరించడమంటే మాటలా... స్టార్స్ అంటే అంతే మరి. ప్రతి విషయంలో హుందాగా ఉండాలని కోరుకుంటారు. మూడు కోట్ల విలువైన కారులో రకుల్ బయటకు వస్తే ఆ ఠీవీనే వేరుగా ఉంటుంది.
కాగా 2021లో రకుల్ బర్త్ డే రోజు తన ప్రియుడంటూ జాకీ భగ్నానీని పరిచయం చేశారు. దీంతో రకుల్-జాకీ వివాహం ఎప్పుడు చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. జాకీ బాలీవుడ్ లో నిర్మాత,నటుడిగా ఉన్నారు. పలు సందర్భాల్లో రకుల్ కి పెళ్లి ప్రశ్న ఎదురైంది. జాకీతో పెళ్లి ఎప్పుడని పదే పదే అడగడంతో ఆమె కొంత అసహనానికి గురయ్యారు. ఆ సమయం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చెబుతాను తరచుగా అడిగి ఇబ్బంది పెట్టొద్దని ఆమె కోప్పడ్డారు.
ఇక టాలీవుడ్ లో ఫేడ్ అవుటైన రకుల్ హిందీ చిత్రాలు చేస్తుంది. 2002లో ఆమె నటించిన అటాక్, రన్ వే 34, కట్ పుట్లి వరుసగా విడుదలయ్యాయి. అయితే ఒక్క చిత్రం కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 తిరిగి ప్రారంభమైంది. కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ సెకండ్ హీరోయిన్ అని సమాచారం. రకుల్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ గా భారతీయుడు 2 చెప్పవచ్చు. తెలుగులో స్టార్ డమ్ అనుభవించిన రకుల్ పవన్, ప్రభాస్ లను మినహాయిస్తే దాదాపు అందరు స్టార్ హీరోలతో చేశారు. తెలుగులో ఆమె నటించిన చివరి మూవీ కొండపొలం. వైష్ణవ్ తేజ్ నటించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.