సీనియర్ హీరోలకు కథానాయికలను వెతకడం చాలా కష్టంగా మారిపోయింది. అరవై ఏళ్లు దగ్గర పడుతున్న హీరోలతో పాతికేళ్ల అమ్మాయిలు రొమాన్స్ చేయడానికి ఆలోచనలో పడుతున్నారు. ఇటీవల దిశాపటానీ.. సల్మాన్ ఖాన్ పై వయసు విషయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తనకంటే పెద్దవాడైనా సల్మాన్ తో ఇక కలిసి నటించనని స్టేట్మెంట్ ఇచ్చింది.

బాలీవుడ్ నటులతో పోలిస్తే టాలీవుడ్ హీరోల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. బాలయ్య, వెంకటేష్, చిరంజీవి వంటి హీరోలకు హీరోయిన్లు దొరకడం పెద్ద టాస్క్ అయిపోయింది.నయనతార, శ్రియ వంటి తారలను రిపీట్ చేస్తూ ఆ లోటు తీర్చుకుంటున్నారు. 

ఇప్పుడు నయన్ బిజీ అయిపోవడం, శ్రియ అందుబాటులో లేకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. బాలకృష్ణ - కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో ఇటీవల ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పాయల్ ని అనుకున్నారు.

కానీ ప్రాజెక్ట్ లేట్ అవుతుండడంతో ఆమె తప్పుకుంది. ఒకరిద్దరు హీరోయిన్లను సంప్రదిస్తే డేట్స్ లేవని చెప్పి పంపించేశారట. మెహ్రీన్ అయినా చేస్తుందనుకుంటే ఆమె కూడా హ్యాండ్ ఇచ్చేసిందట. దాంతో కాజల్, శ్రియలను సంప్రదించే పనిలో పడ్డారట. వారు కూడా ఓకే చెబుతారో లేదో డౌటే!