బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా అనౌన్స్ చేశాడు అఖిల్. ఈ ఇద్దరికీ సినిమా సక్సెస్ అనేది చాలా ముఖ్యం. బొమ్మరిల్లు భాస్కర్ ఎంతో డెడికేషన్ తో సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఈ సినిమాకి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ని కన్ఫర్మ్ చేయలేదు.
అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ కి ఇప్పటివరకు సరైన హిట్టు బొమ్మ పడలేదు. 'అఖిల్' సినిమాతో పరిచయమైన ఈ కుర్ర హీరో మొదటి సినిమాతోనే డీలా పడ్డాడు. 'హలో' సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. అతడు నటించిన మూడో సినిమా 'మిస్టర్ మజ్ను' ఆశించిన స్థాయిలో
సక్సెస్ కాలేకపోయింది. దీంతో అఖిల్ ఆలోచనలో పడ్డాడు.
తన తడుపరి సినిమా అనౌన్స్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ ఇద్దరికీ సినిమా సక్సెస్ అనేది చాలా ముఖ్యం. బొమ్మరిల్లు భాస్కర్ ఎంతో డెడికేషన్ తో సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఈ సినిమాకి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ని కన్ఫర్మ్ చేయలేదు. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన పెళ్లిచూపుల సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే జరగాల్సివుంది.
కానీ హీరోయిన్ లేకపోవడంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. మొదట హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారు. ఆమె కూడా అంగీకరించింది. కానీ ఆఖరి నిమిషంలో
సినిమా నుండి తప్పుకుంది. పోనీ రష్మికని హీరోయిన్ గా తీసుకుందామంటే.. ఆమె ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. సో.. కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుంది. దీంతో టెంపరరీగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.
ప్రస్తుతం దర్శకనిర్మాతలు హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు. 'బొమ్మరిల్లు' సినిమాలో హీరోయిన్ గా జెనీలియాకి ఎంత మంచి పేరొచ్చిందో.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే వారికి కూడా అంత మంచి పేరొస్తుంది నమ్మకంగా చెబుతున్నారు. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అలా తీర్చిదిద్ధారని అంటున్నారు. మరి ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి!
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 19, 2019, 11:42 AM IST