ఈమధ్య సీనియర్ తారలంతా మెగాస్టార్ పై మరోసారి మరసు పారేసుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు బాస్ తో కలిసి నటించడానికి అంటూ.. మనసులో మాట బయట పెట్టేస్తున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి మెగాస్టార్ గురించి తన మనసు విప్పిమాట్లాడారు.  

మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయస్సుకు దగ్గరలో ఉన్నా.. ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాడీలో గ్రేస్ కూడా తగ్గలేదు. ఇప్పటికీ అదేజోరుతో హుషారుతో స్టెప్పులేస్తున్నాడు చిరంజీవి. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఇక ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న తారల దగ్గర నుంచి ఫెయిడ్ అవుట్ అయిన హీరోయిన్ల వరకూ.. కొంత మంది తారలు బాహాటంగానే చిరుతో నటించాలని ఉందంటూ చెప్పేస్తున్నారు. 

ఆమధ్య తమిళస్టార్ హీరోయిన్ ఖుష్బు.. చిరంజీవితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాలని ఉంది అంటూ.. ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. చిరుతో స్టాలిన్ లో సోదరిగా నటించాను కాని.. హీరోయిన్ గా నటించే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టను అంటూ చెప్పేసింది. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా.. ఇలాగామెగాస్టార్ గురించి తన మనసులో ఉన్న మాట బయట పెట్టేసింది. 

మెగాస్టార్ లాంటి స్టార్ డమ్ ఉన్న హీరోతో నటించాలని ఏ హీరోయిన్ కు ఉండదు చెప్పండి. ఇదే విషయంపై టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి కూడా తన మనసులోని మాటను బయటపెట్టింది. రీసెంట్ గా నాగచైనత్య నటించి కస్టరీ మూవీలో ముఖ్యమైన పాత్ర చేసింది ప్రియమణి. ఈమూవీ నిన్న (12 మే) రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ప్రియమణి తన మనసులో మాట బయట పెట్టింది. 

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె తెలుగు హీరోల గురించి మాట్లాడింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేను టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలతో నటించానని చెప్పారు. కానీ అది పూర్తి కాలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అగ్ర హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం రాలేదు. చిరంజీవితో నటించాలని, ఆయనతో కలిసి రోమాన్స్ చేయాలని నా మనసులో ఎప్పటినుంచో ఉంది. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి, ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. అని ప్రియమణి అన్నారు. 

ప్రస్తుతం ప్రియమణి కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అటు ఖుష్బు కూడా అంతే.. రెండు దశాబ్ధాలు తెలుగు, తమిళ తెరను ఏలిన కుష్బుకు కూడా మెగాస్టార్ సరసన నటించే అవకాశం మాత్రం రాలేదు. దాంతో చిరంజీవితో నటించాలన్న కోరికను ఈరకంగా బయట పెడుతున్నారు సీనియర్ బ్యూటీస్.