Asianet News TeluguAsianet News Telugu

భర్తతో గొడవలు జరుగుతూనే ఉంటాయి... ఫైనల్ గా ఒప్పుకున్న హీరోయిన్ ప్రియమణి!


హీరోయిన్ ప్రియమణి వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన భామాకలాపం 2 ఆహా లో స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ప్రియమణి వ్యక్తిగత విషయాల మీద స్పందించారు. 
 

heroine priyamani opens up on differences with husband ksr
Author
First Published Feb 14, 2024, 5:36 PM IST | Last Updated Feb 14, 2024, 5:36 PM IST

ప్రియమణి పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. 2003లో విడుదలైన ఎవరే అతగాడు ఆమె మొదటి చిత్రం. సుదీర్ఘ కెరీర్లో అనేక విలక్షణ పాత్రలు చేసింది. పరుత్తివీరన్ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకుంది. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యాక కూడా ఆమె కెరీర్ నెమ్మదించలేదు. సీనియర్ హీరోల పక్కన గృహిణి రోల్స్ చేస్తుంది. వెబ్ సిరీస్లు, చిత్రాల్లో లీడ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. 

ప్రియమణి తాజాగా భామాకలాపం 2లో నటించారు. ఆహా లో ఫిబ్రవరి 16 నుండి ఇది స్ట్రీమ్ కానుంది. భామాకలాపం ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భామాకలాపం 2 సిరీస్లో ప్రియమణి గృహిణిగా హోమ్లీ రోల్ చేశారు. ఈ పాత్రలో ఓ పెద్ద గ్యాంగ్ ని అల్లాడించే వైలెంట్ షేడ్ కూడా ఉంది. నిజ జీవితంలో ప్రియమణి భర్తను భయపెడుతుందా? భయపడుతుందా? అనే ప్రశ్న ఎదురైంది. 

అందుకు సమాధానంగా... నేను భర్తకు భయపడతాను, అదే సమయంలో భయపెడతాను. అంటే వైలెన్స్ అని కాదు. కొన్ని సందర్భాల్లో భర్త మన మాట వినాలి, మనం కొన్నిసార్లు వాళ్ళ మాట వినాలి. ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట. అయినా భార్య భర్త అన్నాక గొడవలు సాధారణం అని ప్రియమణి చెప్పుకొచ్చారు. ఇక సుదీర్ఘ కాలం పరిశ్రమలో బిజీ యాక్ట్రెస్ గా ఉండటం అదృష్టం అని చెప్పుకొచ్చింది. 

ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మొదటి భార్యతో విడిపోయిన ముస్తఫా రాజ్ ప్రియమణిని చేసుకున్నాడు. ముస్తఫా రాజ్ ఫస్ట్ వైఫ్ ఇప్పటికీ ఆరోపణలు చేస్తుంది. ప్రియమణితో ముస్తఫా వివాహం చెల్లదని అంటుంది. వృత్తి రీత్యా ముస్తఫా రాజ్ ఎక్కువగా అమెరికాలో ఉంటారు. ఆ మధ్య మనస్పర్థలతో విడిపోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios