`మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ఎంతో ముఖ్యం` అని తెలిపింది హీరోయిన్‌ నందిత శ్వేత. ఎంపీ సంతోష్‌ కుమార్‌ జోగిని పల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వతహాగా స్వీకరించిన నందిత శ్వేత శనివారం గచ్చిబౌలిలో మొక్కలు నాటింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, `గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం గురించి తెలుసుకుని స్వతహాగా ఛాలెంజ్‌ని స్వీకరించానని చెప్పింది. 

ఇంకా చెబుతూ, మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని, ఈ ఛాలెంజ్‌ పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని చెప్పింది. ఇంత మంది కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకువెళ్తున్న సంతోష్‌ కుమార్‌కి థ్యాంక్స్` అని చెప్పింది. ఈ సందర్భంగా హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌, హీరో నిఖిల్‌, `కల్కి` సినిమా డైరెక్టర్‌ ప్రశాంత్‌ లకు ఛాలెంజ్‌ విసిరింది. ప్రస్తుతం నందిత శ్వేత తెలుగులో `ఐపీసీ 376`, `కపటదారి` చిత్రాల్లో నటిస్తుంది.