Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ తో మృణాల్ ఠాకూర్, చిరంజీవి 157 మూవీలో హీరోయిన్ గా మరాఠీ భామ..? క్రేజీ రూమర్ లో నిజమెంత..?

మెగాస్టార్ చిరంజీవి జోడీగా మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న క్రేజీ న్యూస్ ఇదే. అసలు ఇందులో నిజం ఎంత..? ఈ కాంబోను సెట్ చేసింది ఎవరు..? ఫిక్స్ అయినట్టేనా..? రూమర్ వరకేనా..? 
 

Heroine Mrunal Thakur In Megastar Chiranjeevi 157 Movie JMS
Author
First Published Sep 7, 2023, 10:51 AM IST


టాలీవుడ్ లో కాంబినేషన్స్ పై ఎప్పటికప్పుడు రూమర్స్ గట్టిగా వినిపిస్తుంటాయి. క్రేజీ  కాంబినేషన్లు.. అస్సలు ఎవరూ ఊహించని కలయికలపై ఎప్పటికప్పుడు వార్తలు అల్లుకుపోతుంటాయి. అవి కాస్త ఫిల్మ్ నగర్ సర్కిల్ దగ్గరకు చేరి.. టాలీవుడ్ అంతా పాకేస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి వార్తే ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ నటిస్తుందని. ఇంతకీ ఇది నిజమేనా..? 

సీతారామం సినిమాతో టాలీవుడ్ లో భారీ క్రేజ్ ని కొల్లగోట్టేసింది  బాలీవుడ్ బ్యూటీ  మృణాల్ ఠాకూర్.. అప్పటి నుంచి ఆమెతో సినిమాలు చేయాలని మేకర్స్ క్యూలు కడుతున్నారు. అయినా సరే మృణాల్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ.. సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. వచ్చిన ప్రతీ ఆఫర్ కు సైన్ చేయకుండా మంచి ప్రాజెక్ట్ లను సెలక్ట్ చేసుకుని మరీ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానీ జోడీగా హాయ్ నాన్న సినిమాతో పాటు విజయ్ దేవరకొండ జతగా..VD13 లో కూడా  హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో..

వరుస ప్లాప్  సినిమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్య కాస్త ఊరటనిచ్చినా..మెగా మ్యానియాను సంతృప్తి పరిచే సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది సాధ్యం కావడంలేదు. ఈక్రమంలో ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.ఈమధ్య బోళా శంకర్ తో ఇబ్బందిపడ్డ మెగాస్టార్.. కాస్త గ్యాప్ తీసుకుని.. ఆయన తన 157వ మూవీ స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా  బింబిసార సినిమాతో సక్సెస్ సాధించిన  దర్శకుడు వశిష్టతో మెగా మూవీచేయబోతున్నాడు. 

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్  సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. అయితే ఈసినిమా స్టార్ట్ అయ్యేలోపు మెగాస్టార్ రెస్ట్ తీసుకోబోతున్నారు. ఈమధ్యనే మోకాలికి సర్జరీ కూడా చేయించుకున్నారట చిరు. ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ఈసినిమాలో హీరోయిన్ ఎవరు..? సాధారణంగానే చాలా మంది పేర్లు వినిపిస్తున్నా.. మెగా 157 లో మాత్రం హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్రకు మృణాల్ ఠాకూర్ అయితేనే న్యాయం చేయగలదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ఆమెను సంప్రదించినట్లు కూడా.

టాలీవుడ్  ఫిలిం వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం .. దాదాపు ఈసినిమాకు ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టే అని అంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో అన్నది తెలియదు. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారట.యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. 

ఇక మెగాస్టార్ చిరంజీవి  గతంలో  చేసిన కొన్ని సోషియో ఫాండసీ బ్యాక్ ట్రాప్ మూవీస్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంతే.. అంజీలాంటి  సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. మరి ఇప్పుడు ఈ Mega 157 చిరుకి హిట్ ఇస్తుందా.. లేదా... ? అనేది చూడాలి. మరోవైపు మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల  మెగా 156 మూవీని నిర్మించబోతోంది. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం అంతా ఈసినిమాపైనే మ్యానియా నడుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios