పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ పై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 300కి పైగా ఉగ్రవాదులు మరణించారు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ పై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 300కి పైగా ఉగ్రవాదులు మరణించారు.

అయితే భారత్ 'సర్జికల్ స్ట్రైక్స్'కి పాల్పడి తప్పు చేసిందని అంటోంది పాకిస్తాన్ హీరోయిన్ మహిరాఖాన్. షారుఖ్ ఖాన్ నటించిన 'రాయిస్' సినిమాలో హీరోయిన్ గా నటించింది మహిరా. 2017లో ఈ సినిమా విడుదలైంది.

తాజాగా ఈ మెరుపు దాడులపై స్పందించిన మహిరా.. పాక్ ని రెచ్చగొట్టి యుద్ధానికి కాలు దువ్వొద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో 'పాక్ ని రెచ్చగొట్టి భారత్ తప్పు చేసింది. సర్జికల్ స్ట్రైక్ వంటి చర్యలతో యుద్ధానికి స్వాగతం పలికినట్టే. భారత్-పాక్ ల మధ్య సాధారణ పరిస్థితిలు రావాలి' అంటూ వెల్లడించింది.

పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మనుమరాలు ఫాతిమా భుట్టో పంపిన ట్వీట్ కి మహిరా ఈ విధంగా స్పందించింది. 

Scroll to load tweet…