ఆయన నాకేం చేశారని, అనుబంధాన్ని కొనసాగించలేదు... మణిరత్నం పై మధుబాల ఆసక్తికర కామెంట్స్
మధుబాల 90లలో స్టార్ గా ఒక వెలుగు వెలిగింది. ఒకప్పటి ఈ స్టార్ లేడీ దర్శకుడు మణిరత్నం ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రోజా చిత్ర క్రెడిట్ ఆయనకు ఇవ్వడానికి ఇష్టపడలేదని ఆమె అన్నారు.
మధుబాల అనగానే టక్కున రోజా చిత్రం గుర్తకు వస్తుంది. అక్కను చూడటానికి వచ్చి చెల్లిని ఇష్టపడతాడు హీరో. దాంతో అనుకోకుండా పెళ్లి పీటలు ఎక్కుతుంది. మణిరత్నం తెరకెక్కించిన క్లాసిక్స్ లో రోజా ఒకటి. మధుబాల నటన చాలా సెటిల్డ్ గా ఉంటుంది. 1992లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. రోజా పాత్ర మధుబాలకు విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. మణిరత్నం వలనే మధుబాలకు మంచి పాత్ర దక్కింది. ఆ క్రెడిట్ అంతా ఆయనదే అంటే మధుబాలకు నచ్చేది కాదట.
రోజా విడుదలయ్యాక... మధుబాల అలానే ఆలోచించారట. నాలో ఆయన రోజాను చూశారు. అందుకే ఎంచుకున్నారు. ఆయన ప్రత్యేకంగా నాకు చేసింది ఏంటట? అని మధుబాల అనుకునేవారట. ఆమెలోని ఆ పొగరుకు తాను పడిన కష్టాలే కారణం అట. తనకు ఎవరూ మద్దతు ఇవ్వలేదట. చివరికి కాస్ట్యూమ్స్, మేకప్ కూడా తానే సిద్ధం చేసుకునేదట. మణిరత్నం గారితో నేను అనుబంధం కొనసాగించలేకపోయాను. అందుకే తదుపరి చిత్రాల్లో నాకు అవకాశం ఇవ్వలేదు, అని ఆమె అన్నారు.
తర్వాత ఆమె మైండ్ సెట్ మారిందట. మణిరత్నం మీద అభిమానం, గౌరవం పెరిగాయట. ఈ విషయాన్ని మధుబాల స్వయంగా చెప్పుకొచ్చారు. మధుబాల జెంటిల్ మెన్, అల్లరి ప్రియుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రాణించారు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.