నితిన్ మూవీతో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ.. ఛాన్స్ ఇచ్చిన వకీల్ సాబ్ డైరెక్టర్ ?
అచ్చతెలుగు అందం లయ స్వయంవరం, మనోహారం, పెళ్ళాంతో పనేంటి, విజయేంద్ర వర్మ లాంటి చిత్రాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. లయ తెలుగు వారందరికీ సుపరిచయమే.
అచ్చతెలుగు అందం లయ స్వయంవరం, మనోహారం, పెళ్ళాంతో పనేంటి, విజయేంద్ర వర్మ లాంటి చిత్రాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. లయ తెలుగు వారందరికీ సుపరిచయమే. ఆ తర్వాత లయ.. గణేష్ గోర్తీ అనే డాక్టర్ ని వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. త్వరలో లయ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సినిమాల్లో రీఎంట్రీ కోసం ఫారెన్ నుంచి ఇండియా వచ్చిన లయ ఆ మధ్యన యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. దీనితో అతి త్వరలో లయ సిల్వర్ స్క్రీన్ పై రే ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ లాంటి బడా డైరెక్టర్స్ ఆమెకి అవకాశం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.
తాజాగా లయ ఒక క్రేజీ ఆఫర్ పట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ప్రస్తుతం నితిన్ తో తమ్ముడు అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ నుంచి రాబోతున్న చిత్రం పైగా పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో పాత్రల ఎంపిక విషయంలో వేణు శ్రీరామ్ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారట.
దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ లయతో సంప్రదింపులు జరపడం ఆమె ఓకె చెప్పడం జరిగినట్లు తెలుస్తోంది. అయితే లయ ఎలాంటి పాత్రలో నటిస్తోంది.. అక్క , వదిన లాంటి రొటీన్ పాత్ర లేక స్పెషల్ రోలా అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కాంతార హీరోయిన్ సప్తమి గౌడ ఎంపిక చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.