ఆ భయం వెంటాడింది... పెళ్ళెందుకు చేసుకోలేదో చెప్పిన నటి కౌశల్య!
43 ఏళ్ల కౌశల్య వివాహం చేసుకోకపోవడం విశేషం. మరి ఇంత వయసొచ్చినా ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఆమె స్వయంగా వివరించారు.

కన్నడ భామ కౌశల్య (Kausalya)1996లో వెండితెరకు పరిచయమైంది. ఆమె మొదటి సినిమా ఏప్రిల్ 19. జగపతిబాబు హీరోగా 1999లో విడుదలైన అల్లుడుగారు వచ్చారు మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. అనంతరం శ్రీకాంత్ కి జంటగా పంచదార చిలక చేసింది. ఈ రెండు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. టాలీవుడ్ కి దూరమైన కౌశల్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. గౌరీ మూవీలో నరేష్ భార్య పాత్ర చేసింది. తెలుగులో అడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన హీరో మూవీలో ఆమె చివరిగా కనిపించారు.
43 ఏళ్ల కౌశల్య వివాహం చేసుకోకపోవడం విశేషం. మరి ఇంత వయసొచ్చినా ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఆమె స్వయంగా వివరించారు. ''వివాహ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. సరైన వ్యక్తి భర్తగా వస్తే జీవితం అందంగా ఉంటుంది. నాకు తగినవాడు దొరకడేమో అనే ఆందోళన పడ్డాను. ఎందుకో తెలియదు రిలేషన్ నాకు సెట్ కాదనిపించింది. అందుకే తల్లిదండ్రులతో ఉండిపోయాను.
తల్లిదండ్రులతో ఉంటున్నప్పుడు కూడా పెళ్లి ఆలోచన వచ్చింది. అయితే అత్తమామలతో నేను ఇమడగలనా అనే సందేహం, ఆందోళన కలిగింది. ఇలా అనేక ఆలోచనలు నన్ను పెళ్లి అంటే భయానికి గురి చేశాయి. దానికి తోడు అనారోగ్యానికి గురయ్యాను. బరువు పెరిగాను. నటించిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో అన్ని విషయాల నుండి బ్రేక్ తీసుకున్నాను...'' అని వెల్లడించింది.
కౌశల్య తీరు చూస్తే ఇకపై ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదనిపిస్తుంది. అనుష్క శెట్టి, టబు, నగ్మా, శోభన ఇలా పలువురు హీరోయిన్స్ పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయారు. ఈ లిస్ట్ లో కౌశల్య కూడా చేరింది. ఒంటరిగా జీవించే మహిళల లిస్ట్ పెరిగిపోతుంది.