తాజాగా కొడుకు పక్కనే పడుకొని ఓ ఫోటో  దిగిన కాజల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది ఆ ఫొటోకు మై లైఫ్ అంటూ కామెంట్ పెట్టింది. ఇక కాజల్ తల్లీ కొడుకుల ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. కాజల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై ఫ్యాన్స్ , సెలెబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు.


ప్లానింగ్ అంటే కాజల్ దే. దశాబ్దానికి పైగా స్టార్ లేడీగా వెలిగిపోయిన కాజల్ (Kajal Aggarwal)ఫేడ్ అవుట్ స్టేజ్ దగ్గరవుతుండగా... పెళ్లి చేసుకుంది. 2020 అక్టోబర్ నెలలో లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. పెళ్ళైన ఏడాదిన్నర కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేశారు. 2022 ఏప్రిల్ లో కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకు నీల్ కిచ్లు అని నామకరణం చేసింది. ఇక అప్పుడప్పుడు తన కొడుకు క్యూట్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తుంది. తాజాగా కొడుకు పక్కనే పడుకొని ఓ ఫోటో దిగిన కాజల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది 

ఆ ఫొటోకు మై లైఫ్ అంటూ కామెంట్ పెట్టింది. ఇక కాజల్ తల్లీ కొడుకుల ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. కాజల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై ఫ్యాన్స్ , సెలెబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ అప్పట్లో కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు. ఈ కారణంగా ఆమె చేతిలో చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేవు. గతంలో ఆమె ఒప్పుకున్న రెండు తమిళ్, ఓ హిందీ చిత్రం మాత్రం చేస్తున్నట్లు సమాచారం. ఇక కాజల్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాల్లో చిక్కుకున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినా కూడా విడుదలకు నోచుకోవడం లేదు. 

View post on Instagram

అయితే కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ విక్రమ్ (Vikram) భారీ విజయం అందుకుంది. వరల్డ్ వైడ్ రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో భారతీయుడు 2 చిత్రాన్ని తెరపైకి తేవాలని చూస్తున్నారట. ఆ మూవీ విడుదలైతే కాజల్ కి ప్లస్ అవుతుంది. అలాగే ఆచార్య మూవీ నుండి కాజల్ ని తప్పించారు. షూటింగ్ లో కూడా పాల్గొన్న కాజల్ పాత్రను తీసేయడం జరిగింది. ఆమె పాత్రకు ప్రాధాన్యత లేని కారణంగా చిరంజీవి జంటగా నటించిన కాజల్ రోల్ ఎత్తేశారు. అయితే ఆచార్య భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.