జాన్వీ కపూర్ టీనేజ్ లుక్ తో ఇప్పుడు పోల్చి చూసిన జనాలు షాక్ అవుతున్నారు. అసలు ఇంతలా మారిపోవడం వెనుక కారణాలు అన్వేషిస్తున్నారు.
జాన్వీ కపూర్ బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అయ్యారు. ఈ స్టార్ కిడ్ గ్లామరస్ ఫోటోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. కురచబట్టల్లో టెంప్టింగ్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ టెంపరేచర్ పెంచేస్తుంటారు. జాన్వీ కపూర్ కపూర్ ని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 21 మిలియన్ ఫాలో అవుతున్నారు. అంటే రెండు కోట్లు. సోషల్ మీడియాలో జాన్వీ రేంజ్ అది. ఇంస్టాగ్రామ్ తనకు ఒక ఆదాయమార్గంగా ఉందని జాన్వీ ఓపెన్ గానే చెప్పారు. చూడగానే కట్టిపడేసే ఆకర్షణ ఆమె సొంతం. పరువాలను ఎరవేస్తూ రెచ్చగొట్టడం జాన్వీ హాబీ.
అందం కోసం జాన్వీ చాలానే కష్టపడతారు. ప్రతిరోజూ జిమ్, యోగా చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. సౌందర్యం కోల్పోకుండా కడుపు మాడ్చుకుంటారు. అయితే సహజంగా సంక్రమించిన గ్లామర్ కి జాన్వీ కృత్రిమ మెరుగుపెట్టారేమో అనే సందేహం ఎప్పటి నుండో ఉంది. జాన్వీ ప్రెసెంట్ లుక్ టీనేజ్ లుక్ తో కంపేర్ చేస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
వయసు పెరిగేకొద్దీ ప్రతి మనిషిలో మార్పులు చోటు చేసుకుంటాయి. టీనేజ్ తో పోల్చితే యంగ్ ఏజ్ కి ఫేస్ లో తేడాలు వస్తాయి. అయితే ఏ అవయవం సమూలంగా మారిపోదు. జాన్వీ ముఖంలో కొన్ని ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే... జాన్వీ ముక్కు. టీనేజ్ లో ఆమె ముక్కు లావుగా కనిపిస్తుంది. 25ఏళ్ల జాన్వీ ముక్కు ఇప్పుడు అలా లేదు. సన్నగా... హాలీవుడ్ భామల ముక్కును పోలి ఉంది. ఈ క్రమంలో ఆమె నోస్ సర్జరీ చేయించుకొని ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అమ్మ శ్రీదేవి పోలికలు జాన్వీలో కొన్ని ఉన్నాయి. ఇద్దరి కళ్ళు ఒకలానే ఉంటాయి. ముక్కు కూడా ఆమెదే. అందానికి ప్రాణం ఇచ్చే శ్రీదేవికి తన ముక్కు నచ్చేది కాదట. స్టార్ గా ఎదిగి బాలీవుడ్ కి వెళ్ళాక ఆమె నోస్ సర్జరీ చేయించుకున్నారనే వాదన ఉంది. అమ్మ మాదిరి జాన్వీ కూడా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ పాల్పడి ఉంటారని సోషల్ మీడియా జనాలు అంచనా వేస్తున్నారు. శ్రీదేవి బ్రతికుండగానే జాన్వీ యాక్టింగ్ మొదలుపెట్టారు. అయితే జాన్వీ ఫస్ట్ మూవీ ధడక్ విడుదల కాకుండానే కన్నుమూశారు. కాబట్టి అమ్మ శ్రీదేవి స్వయంగా జాన్వీకి సర్జరీ చేయించి ఉండొచ్చనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
ఇక జాన్వీ కెరీర్ పరిశీలిస్తే... ఆమెకు ఇంకా సరైన కమర్షియల్ హిట్ పడలేదు. బాలీవుడ్ స్టార్స్ పక్కన ఆఫర్స్ రావడం లేదు. కాగా ఎన్టీఆర్ 30లో ఆమె హీరోయిన్ గా సైన్ చేశారంటున్నారు. జాన్వీ మీద ఫోటో షూట్ కూడా ముగియగా ఆమె ఎన్టీఆర్ తో జతకట్టడం అనివార్యమే అంటున్నారు.
