ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లలో బెస్ట్ డాన్సర్ ఎవరో చెప్పిన హన్సిక... మొత్తానికి డేర్ చేసింది!
టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరంటే... ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేర్లు తెరపైకి వస్తాయి. వీరిలో ఎవరు టాప్ అనే ప్రశ్న ఎదురైతే చెప్పడం కష్టమే. హన్సిక మాత్రం తన అభిప్రాయం బయటపెట్టింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన హన్సిక మోత్వానీకి హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు దర్శకుడు పూరి జగన్నాధ్. అల్లు అర్జున్ హీరోగా పూరి తెరకెక్కించిన దేశముదురు సినిమాలో హన్సిక నటించారు. దేశముదురు సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఎన్టీఆర్, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. అనంతరం కోలీవుడ్ లో బిజీ అయిన హన్సిక మోత్వానీ తెలుగులో తక్కువగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఆమెకు కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్టీఆర్, బన్నీ, చరణ్ లలో బెస్ట్ డాన్సర్ ఎవరో చెప్పాలని యాంకర్ అడిగారు. ముగ్గురూ బాగా చేస్తారు. ఒకరి పేరు చెప్పలేమని ఆమె అన్నారు. డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దు ఒకరి పేరు చెప్పుమనగా... హన్సిక ఎన్టీఆర్, బన్నీ పేర్లు చెప్పింది. వీరిద్దరూ బెస్ట్ డాన్సర్స్ వారిలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం కష్టం అని హన్సిక అన్నారు.
ఇక తనకు నచ్చిన సినిమా పుష్ప అని చెప్పారు. రీసెంట్ గా ఖుషి చూశాను అన్నారు. తనను హీరోయిన్ చేసిన దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే ఇష్టం అన్నారు. పుష్ప 2, సలార్, దేవర చిత్రాల్లో దేని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని అడగ్గా.. సలార్ అని తడుముకోకుండా చెప్పింది. దేవర, పుష్ప 2 చిత్రపై కూడా చాలా ఆసక్తి ఉందని ఆమె అన్నారు.
పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉందని అడగ్గా... ఏమీ మారలేదు. జస్ట్ డ్రెస్ మారింది అంతే. ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి టైం ఇస్తూ బ్యాలెన్స్ చేస్తున్నట్లు హన్సిక అన్నారు. హన్సిక తెలుగులో నటించిన చివరి చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాలతో పాటు మరో రెండు తమిళ చిత్రాలు చేస్తున్నారని సమాచారం. 2022లో హన్సిక వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను వివాహం చేసుకుంది.