హీరోయిన్ కారుపై పాడుపని.... పోలీసులకు ఫిర్యాదు

First Published 8, Mar 2018, 11:31 AM IST
Heroine filed case against a unknown person
Highlights
  • నటి మోనల్ గజ్జర్..ఒక వ్యక్తి తన వాహనంపై మూత్రం పోశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
  • ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.

‘సుడిగాడు’, ‘వెన్నెల వన్ బై టూ’, ‘బ్రదరాఫ్ బొమ్మాళి’ తదితర టాలీవుడ్ చిత్రాల్లో నటించిన నటి మోనల్ గజ్జర్... ఒక వ్యక్తి తన వాహనంపై మూత్రం పోశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో తాను ఒక షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తుండగా, తన కారు టైరుపై ఒక వ్యక్తి మూత్రం పోస్తున్నాడని ఆరోపించింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోనల్ తన స్నేహితురాలితోపాటు అంబావాడీ ప్రాంతంలోని ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లింది. మాల్ ఎదుట కారును నిలిపివుంచింది. షాపింగ్ పూర్తయిన తరువాత బయటకు వస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆమె కారు టైరుపై మూత్రం పోస్తుండటాన్ని గమనించి, అతడిని వారించింది. అయినా ఆ వ్యక్తి మాట వినకుండా తన పనికానిచ్చేశాడు. కాగా నిందితుడు ఆ మాల్ ఎదుట ఒక దుకాణం నిర్వహిస్తుంటాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

loader