రవితేజ సినిమాలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అద్భుల్లా పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆమె హీరోయిన్ గా నటిస్తోందా..? లేక ఇంకేదైన పాత్రలో నటిస్తోందా...?
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు మాస్ హీరో రవితేజ . త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో ధమాకా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా లో రవితేజ సరసన పెళ్లి సందడి ఫేం శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టులో జాతిరత్నాలు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన ఫరియా అబ్దుల్లా కూడా నటిస్తోంది. అయితే ఈ మూవీలో ఫరియా ఫీ మేల్ లీడ్ రోల్ అని టాక్ కూడా వచ్చింది.
అయితే తాజాగా ఓ క్రేజీ గాసిప్ బయటకు వచ్చింది.ఈ మూవీలో రవితేజ సోదరి పాత్రలో ఫరియా కనిపించబోతుందన్న వార్త ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. నె్టింట్లో ఈ గాసిప్ షికారు చేస్తోంది. అయితే ఇది నిజమా.. లేకపోతే గాసిప్‌లాగే ఉండిపోతుందా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రేజీ న్యూస్‌తో సిల్వర్ స్క్రీన్‌పై రవితేజ-ఫరియా అన్నాచెల్లెళ్లుగా ఎలా ఎంటర్‌టైన్ చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చర్చ మొదలయ్యింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ప్రసన్నకుమార్ బెజవాడ ధమాకా చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజర్ కాగా…రామ్-లక్ష్మణ్ ఫైట్స్ మాస్టర్స్. రవితేజ మరోవైపు డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవతో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న రావణాసుర మూవీలో నటిస్తున్నాడు. తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావుతో నార్తిండియా ప్రేక్షకులను కూడా పలుకరించేందుకు రెడీ అవుతున్నాడు.
