హీరోయిన్‌ డింపుల్‌ హయతి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. `రామబాణం` చిత్రంలో ఆమె పాత్రకి సంబంధించి ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్న ఆమెని ఇబ్బంది పెట్టింది. దీంతో అసహనానికి గురయ్యింది. 

డస్కీ బ్యూటీ డింపుల్‌ హయతి `ఖిలాడీ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇందులో రవితేజతో కలిసి మాస్‌ డాన్సులు చేసి ఉర్రూతలూగించింది. ఆ సినిమా పరాజయం చెందినా, డింపుల్‌ మాత్రం పాపులర్‌ అయ్యింది. ఆమె అంద చెందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. మరింత ఫేమస్‌ అయ్యింది. కొంత గ్యాప్‌తో ఇప్పుడు `రామబాణం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది డింపుల్‌. గోపీచంద్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. 

దర్శకుడు శ్రీవాస్‌ రూపొందించిన `రామబాణం` చిత్రం మే 5న రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు యూనిట్‌. అందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌ టీమ్‌ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. అందులో భాగంగా హీరోయిన్‌ డింపుల్‌ని ప్రశ్నించారు ఓ రిపోర్టర్‌. సినిమాలో మీరు కాస్త వల్గర్‌ గా, రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు? మీ పాత్ర ఎలా ఉంటుందని అడిగాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. డింపుల్‌ మాత్రమే కాదు, ఈ ప్రశ్న అందరిని షాక్‌కి గురి చేసింది. 

దీనిపై డింపుల్‌ తీవ్ర అసహనానికి గురయ్యింది. ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. కాసేపు ఆమె అటు ఇటు ఆలోచించింది. వల్గర్‌ అంటారేంటి, నాకు తెలిసి సినిమాలో ఎక్కడా వల్గర్‌ సీన్స్ చూడలేదు. గ్లింప్స్ కూడా అలాంటివి యూనిట్‌ విడుదల చేయలేదు. మా సినిమా పాటలు, పోస్టర్లలోనూ నేను శుభ్రంగానే ఉన్నాను. మీరు వల్గర్‌ అంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు. దాని మీనింగ్‌ అర్థం కావడం లేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. హీరోయిన్‌ పరిస్థితిని గమనించిన దర్శకుడు శ్రీవాస్‌.. కల్పించుకుని తాను సమాధానం చెప్పాడు. 

తను ఏం పదం వాడాలో తెలియక వల్గర్‌ పదం వాడాడనని, కవర్‌ చేస్తూ, ఈ ప్రెస్‌ మీట్‌కి ఆమె వేసుకున్న డ్రెస్‌ చూస్తేనే సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉందో అర్థమవుతుంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ట్రెడిషనల్ గా ఉంటుంది. తాను ట్రెడిషనల్‌గా ఉండాలని వెస్ట్రన్‌ దుస్తులు వేసుకోకుండా వచ్చింది. అందుకే ఇలాంటి సాంప్రదాయ దుస్తుల్లోనే ప్రమోషన్స్ లో కనిపిస్తుందని చెప్పారు శ్రీవాస్‌. దీన్ని బట్టి ఆమె పాత్ర తీరు తెన్నులను అర్థం చేసుకోవాలని తెలిపారు. దీంతో ఈ సమాధానం సదరు రిపోర్టర్‌కి మొహం వాడిపోవడం గమనార్హం. 

`లక్ష్యం`, `లౌక్యం` చిత్రాల తర్వాత గోపీచంద్‌, శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. బ్రదర్స్ సెంటిమెంట్‌తో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మే 5న సినిమా తెలుగులో రిలీజ్‌ కాబోతుంది. హిందీలోనూ డబ్బింగ్‌ వర్షెన్‌ రిలీజ్‌ చేయబోతున్నారని సమాచారం.