బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ మొదటి నుండి తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎన్నుకుంటూ వస్తోంది. క్యామియో, గెస్ట్ అప్పియరన్స్ లకు కాస్త దూరంగానే ఉంటుంది. అయితే 14 నిమిషాల నిడివి ఉండే ఓ సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొందరిని ఆశ్చర్యపరుస్తోంది.

దీపికా పదుకోన్ భర్త, నటుడు రణవీర్ సింగ్ '83' అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ కథ మొత్తం కపిల్ దేవ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది.

వరల్డ్ కప్ గెలవడానికి అతడు పడ్డ శ్రమ, వింటేజ్ క్రికెట్ డ్రామా నేపధ్యంలో సన్నివేశాలుంటాయి. కపిల్ దేవ్ పాత్ర కోసం రణవీర్ ని ఎన్నుకున్నారు. సినిమాలో కపిల్ దేవ్ భార్యగా 
దీపికా పదుకోన్ కనిపించనుంది. అయితే కథలో ఆమెకి ఎక్కువ ప్రాముఖ్యత ఉండదట. గాలరీలో కూర్చొని భర్తని ప్రోత్సహించడం, ఇంట్లో ఒకట్రెండు సన్నివేశాలు మినహా ఆమె రోల్ పెద్దగా ఏమీ ఉండదని టాక్.

అయితే ఈ పాత్ర ఒప్పుకోవడానికి దీపికా రూ.14 కోట్లు డిమాండ్ చేసిందట. నిర్మాతలు అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారంటే ఆమె క్రేజ్ 
ఏంటో అర్ధం చేసుకోవచ్చు. భర్త హీరోగా నటిస్తోన్న సినిమా అని ఎలాంటి మొహమాటాలకు పోకుండా తనకు కావాల్సిన మొత్తాన్ని రెమ్యునరేషన్ గా పొందింది ఈ స్టార్ హీరోయిన్.