కార్తికేయ 2 చిత్ర ప్రమోషన్స్ లో అనుపమ కనిపించడం లేదు. దీంతో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు.  

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 విడుదలకు సిద్ధమైంది. దీంతో చిత్ర యూనిట్ నిఖిల్, డైరెక్టర్ చందూ మొండేటి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కాగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రచార కార్యక్రమాల్లో కనిపించడం లేదు. దీంతో అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుపమ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆమె కార్తికేయ 2 చిత్ర ప్రమోషన్స్ కి హాజరు కాకపోవడం వెనుక కారణాలు వెల్లడించారు. 

ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసిన అనుపమ(Anupama Parameswaran) ఈ విధంగా వివరణ ఇచ్చారు. అందరికీ నేను ఓ విషయంలో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇతర చిత్రాల షూటింగ్స్ లో నేను బిజీగా ఉన్నాను. రాత్రి పగలు తీరిక లేకుండా షూటింగ్స్ చేస్తున్నాను. ఈ కారణంగా నేను కార్తికేయ 2 ప్రమోషన్స్ కి హాజరు కాలేకపోతున్నాను. అందులోనూ కార్తికేయ 2 విడుదల తేదీల్లో మార్పులు జరిగాయి. దాని వలన కూడా కొంత గందరగోళం ఏర్పడింది. నా ఇబ్బంది మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. కార్తికేయ 2 యూనిట్ కి ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా హీరో నిఖిల్ ఈ సినిమా కోసం పడ్డ కష్టానికి నా ప్రేమాభిమానాలు... అంటూ ఇంస్టాగ్రామ్ లో సందేశం పోస్ట్ చేశారు. 

View post on Instagram

2014లో విడుదలైన కార్తికేయ చిత్రానికి ఇది సీక్వెల్. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 12న వరల్డ్ వైడ్ కార్తికేయ 2(Karthikeya 2) విడుదల కానుంది. నిజానికి జులై 22న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. కార్తికేయ 2 ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. 

కాగా అనుపమ హీరో నిఖిల్(Nikhil) తో మరో చిత్రం చేస్తున్నారు. 18 పేజెస్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి పలనాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ మూవీ విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ కథను సమకూర్చగా... గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.