తన బిడ్డపై బెంగపెట్టుకుంది ఆలియా భట్. ఇప్పటి వరకూ ఎప్పుడూ తన బిడ్డను వదిలి ఉండే అవసరం రాలేదని...కాని ఇఫ్పుడు తప్పక ఉండక వచ్చిందని అంటోంది.  

ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ స్టార్ ఫ్యామిలీలో రణ్ బీర్.. ఆలియా భట్ అండ్ వారి గారాల పట్టి రాహా కపూర్ కూడా ఉన్నారు. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ కపుల్.. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. పెళ్ళి చేసుకుని.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే ఓ పాపకు కూడా జన్మనిచ్చారు. తమ గారాల కూతురికి రాహా కపూర్ అని పేరు కూడా పెట్టుకున్నారు. కాని బిడ్డను మాత్రం ఇంత వరకూ చూపించలేదు స్టార్ కపుల్. 

ఇక పాప పుట్టగానే తన కెరీర్ కు రెండేళ్ల బ్రేక్ ప్రకటించేసింది ఆలియా భట్. కూతురి ఆలపా పాలనా.. బాగోగులు చూసుకోవాలి కనుక ఇంటి దగ్గరే ఉంటూ.. తన కూతురితో టైమ్ స్పెండ్ చేస్తోంది. ఇక తన కూతురుని చూసకోవడం కోసం రణ్ బీర్ కపూర్ కూడా ఓ 6 నెలలు బ్రేక్ తీసుకున్నట్టు తెలిపారు. 

ఆలియా భట్ ఇంటిపట్టునే కాలం గడుపుతోంది. అయితే అప్పుడప్పుడు మీడియా ముందు మెరుస్తున్న ఈ బ్యూటీ తాజాగా అమెరికాలో జరిగిన ఫ్యాషన్ ఫెస్టివల్ మెట్ గాలాలో సందడి చేసింది.ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించింది ఆలియా.. ఏమాత్రం తగ్గకుండా .. తనబ్యూటీ పవర్ ఏంటో చూపించేసింది. ఈమధ్యే పాపకు జన్మనిచ్చిన ఆలియా భట్.. గాలా వేడుకల్లో మాత్రం చాలా ఫిట్గా, హాట్ గ్లామర్ లుక్తో సందడి చేస్తూ అభిమానుల హృదయాలను ఆకట్టుకుంది. 

ఇక ఈ ఫ్యాషన్ ఫెస్టివల్ లో అందరి చూపు ఆమె డ్రెస్పైనే పడింది. ఈ ఫెస్టివల్ లో ఆలియా లక్ష ముత్యాల తెల్లటి గౌనులో దేవతలా మంత్రముగ్ధులను చేసింది. అయితే మెట్ గాలా ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్లిన ఆలియా తన గారాలపట్టి చిన్నారి కూతుర్ని బాగా మిస్ అవుతోంది. ఈ ఈవెంట్ కోసం ఆలియా తన కూతురికి నాలుగు రోజుల పాటు దూరంగా ఉందట బ్యూటీ. 

ఈ క్రమంలో కూతురిని బాగా మిస్ అవుతున్నానంటూ ఆలియా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో మెట్ గాలా వేడుకకు రెడీ అవుతున్న సమయంలో తన కూతురు రాహా గురించి మాట్లాడుతూ….పాప పుట్టిన ఈ ఆరు నెలల కాలంలో నేను నా బిడ్డను 24గంటల కంటే ఎక్కువ సమయం విడిచి ఉండలేదని అంటోంది. 

అంతే కాదు తనను వదిలేసి ఇలా వేడుకలకు రావల్సి వచ్చిందంటూ వాపోయింది బ్యూటి. దీంతో కూతురు మీద ఆలియాకి ఉన్న ప్రేమ చూసి అంతా ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ లోఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.