హీరోయిన్: నగ్నంగా నటించకపోతే అర్ధం లేదు

హీరోయిన్: నగ్నంగా నటించకపోతే అర్ధం లేదు

బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించిన ఆకృతి సింగ్ 'ఎక్స్ వీడియోస్' అనే చిత్రంతో తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే తొలి సినిమాలోనే నగ్నంగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ స్టోరీ ఏంటో చూద్దాం!

పోర్న్ వెబ్ సైట్ల కారణంగా యూత్ ఏ విధంగా చెడిపోతుందో ప్రజలకు తెలియజేయాలని అనుకున్నాడు దర్శకుడు సజో సుందర్. అదే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాడు. అయితే కంటెంట్ పరంగా సినిమాకు మంచి ప్రశంసలే దక్కాయి. సినిమాలో ఆకృతి సింగ్ మాత్రం నగ్నంగా కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఈ విషయంపై వివరణ ఇచ్చిన ఆకృతి. ఆ సన్నివేశానికి అలా చేయడమే న్యాయమనిపించిందని వెల్లడించింది.

''ఓ సామాజిక సమస్యతో ఈ సినిమా రూపొందించాం. ఇందులో ఎలాంటి అశ్లీలం ఉండదు. కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే చిత్రమిది. సరదాగా మనం ఫోన్ లో తీసుకునే వీడియోల కారణంగా ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయి ఈ సినిమాలో చూపించాం. కథలో భాగంగా ఓ సన్నివేశంలో నగ్నంగా కనిపించాల్సి వచ్చింది. అలా చేయకపోతే సినిమా తీయడంలో అర్ధమే లేదు. ఒక నటిగా ఆ సీన్ లో నటించడం నా బాధ్యత. ఈ సినిమా చూసిన తరువాత మనం తెలియకుండా చేసిన పొరపాట్లు గుర్తు తెచ్చుకొని జాగ్రత్త పడతారు'' అని వెల్లడించారు. 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page