Asianet News TeluguAsianet News Telugu

పైకి కనిపించేంత అమాయకురాలిని కాదు... అతని చెంప చెళ్లుమనిపించాను!

సోనియా అగర్వాల్ వెండితెర ఎంట్రీ టాలీవుడ్ ద్వారానే జరిగింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో 2002లో విడుదలైన నీ ప్రేమకై ఆమె మొదటి చిత్రం. వినీత్, అబ్బాస్ హీరోలుగా ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. 

heroin sonia agarwal says she is not an innocent as show looks on screen
Author
Hyderabad, First Published Dec 8, 2021, 8:42 AM IST

7/జి బృందావన్ కాలని మూవీలో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ చిత్రంలో అనిత పాత్రలో ఆమె మెప్పించారు. 7/జి బృందావన్ కాలని అప్పట్లో ఓ సంచలనం. ఆ సినిమా విజయం ఆమెను తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా మార్చేసింది. తెలుగులో కూడా ఆమెకు ఫేమ్ ఏర్పడింది. 

అయితే సోనియా అగర్వాల్ వెండితెర ఎంట్రీ టాలీవుడ్ ద్వారానే జరిగింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో 2002లో విడుదలైన నీ ప్రేమకై ఆమె మొదటి చిత్రం. వినీత్, అబ్బాస్ హీరోలుగా ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. మంచి విజయాలు దక్కినా సోనీ అగర్వాల్ కెరీర్ ని సరిగా నిర్మించుకోలేకపోయారు. ఆమె త్వరగా ఫేడ్ ఔట్ దశకు చేరారు. ప్రస్తుతం సోని అగర్వాల్ క్యారెక్టర్ రోల్స్  లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. 

Also read ప్రేమికుడి చేతిలో మోసపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్... డబ్బులు, నగలు దొంగిలించి పరారీ!
ఆమె నటించిన బై లింగ్వల్ మూవీ గ్రాండ్ మా. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా... ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సోనియా మాట్లాడుతూ.. నాకు చిన్నతనం నుంచే సంగీతం అంటే ఎంతో ఇష్టమని, అందుకే సొంతంగా ఒక పాట పాడాలన్న కోరిక అప్పటి నుంచే ఉందని హీరోయిన్‌ సోనియా అగర్వాల్‌ పేర్కొంది. పైగా తన సోదరుడు సంగీత దర్శకుడని, అందువల్ల తాను గాయనిగా పాట పాడి, నటించాలని ఉందని తెలిపింది.

 Also read సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసిన శశికళ... రాజకీయవర్గాల్లో కొత్త చర్చ!
సోనియా ఇంకా మాట్లాడుతూ... గ్రాండ్ మా  మూవీలో నేను టీచర్‌ పాత్ర పోషించాను. సాధారణంగా అనేక చిత్రాల్లో నా పాత్రలన్నీ అమాయకురాలిగా ఉంటాయి. కానీ, నేను రఫ్‌ అండ్‌ టఫ్‌ టైపు. చదువుకునే రోజుల్లో ఓ విద్యార్థి నన్ను హేళన చేసినందుకు లాగి చెంపపై కొట్టాను. నా మాతృభాష పంజాబీ. కానీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో దాదాపు 40కు పైగా చిత్రాల్లో నటించాను. నాకు ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన సంగీత దర్శకుడుగా కొనసాగుతున్నాడు. మున్ముందు అవకాశం లభిస్తే మాత్రం ఖచ్చితంగా గాయనిగా నటిస్తాను అని సోనియా అగర్వాల్‌ చెప్పుకొచ్చింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios