స్టార్ కిడ్ శృతి హాసన్ కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. మరలా ఆమె స్టార్స్ పక్కన అవకాశాలు దక్కించుకుంటుంది. క్రాక్ మూవీ టాలీవుడ్ కమ్ బ్యాక్ ఇవ్వగా ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రవితేజ కెరీర్ బెస్ట్ వసూళ్లు రాబట్టిన క్రాక్, శ్రుతికి నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. వకీల్ సాబ్ చిత్రంలో కూడా శృతి హాసన్ చిన్న క్యామియో రోల్ చేయడం విశేషం. 

అనూహ్యంగా ప్రభాస్ లాంటి స్టార్ పక్కన పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకోవడం ఊహించని పరిణామమే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. 2022 ఏప్రిల్ 14న సలార్ గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక తన అభిమానుల కోసం సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్నారు శృతి హసన్ అనేక ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 

ఇక మీకు జీవితంలో మరచిపోలేని రోజు ఏదని ఓ ఫ్యాన్ అడుగగా శ్రుతి హాసన్ సమాధానం చెప్పారు. మొదటిసారి సింగపూర్ లో ఓ వేదికపై లైవ్ లో సాంగ్ పాడాను. అది నాకు జీవితంలో మరపురాని రోజు అన్నారు. మల్టీ టాలెంటెడ్ అయిన శృతి ఫొఫెషనల్ సింగర్. ఆమె అనేక విదేశీ వేదికలపై లైవ్ షోలు చేశారు. శృతి రచయిత కూడా కావడం విశేషం.