Asianet News TeluguAsianet News Telugu

Samantha: జిమ్ ఫిట్ లో చెమటలు కక్కిస్తున్న సమంత... వీడియో వైరల్


స్టార్ లేడీ సమంత (Samantha) 2022లో సంచలనాలు చేయనున్నారు. ఆమె హీరోయిన్ గా ఏకంగా రెండు పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలాగే కొన్ని క్రేజీ వెబ్ సిరీస్లకు సైన్ చేశారు. సదరు ప్రాజెక్ట్స్ కోసం ఆమె మానసికంగా శరీరకంగా సిద్ధం అవుతున్నారు. 
 

heroin samantha hard work out video getting viral
Author
Hyderabad, First Published Jan 11, 2022, 3:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

జీవితంలో కష్టాలు, కన్నీళ్లు కామన్. అలా అని ఏడుస్తూ అక్కడే కూర్చుంటే జీవితమే ఉండదు. సమంత లైఫ్ లో 2021 డార్క్ ఇయర్. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్యతో ఆమెకు విడాకులయ్యాయి. తప్పు ఎరిదైనా... నిర్ణయం ఎవరు తీసుకున్నా...  కానీ ఇది ఇద్దరినీ బాధించిన విషయం. అనాదిగా ఇలాంటి విషయాల్లో ఆడాళ్ళనే తప్పుబడతారు. సమంత విషయంలో కూడా అదే జరిగింది. మీడియాతో పాటు సొసైటీ ఆమెను టార్గెట్ చేయడం, ఆరోపణలు మోపడం చేశారు. 

విడాకులకు మించిన వేదన నిరాధార కథనాలతో ఎదుర్కొన్నారు. చివరికు సమంత స్వయంగా తప్పుడు ప్రచారాలు చేయొద్దని వేడుకున్నా వినలేదు. దీంతో ఆమె లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. స్నేహితులు కుటుంబ సభ్యుల సహకారంతో సమంత విడాకుల డిప్రెషన్ నుండి బయటికి వచ్చారు.  ఒక దశలో సినిమాలకు విరామం ప్రకటించిన సమంత వరుసగా చిత్రాలు ప్రకటించారు. 

ఇక 2022 అంతా ఆమె క్యాలెండర్ ఫుల్ గా ఉంది. సినిమాలు సిరీస్లతో హోరెత్తించనున్నారు. దాని కోసం సమంత అదే స్థాయిలో సమాయత్తం అవుతున్నారు. సహజంగానే సమంత ఫిట్నెస్ ఫ్రీక్. వ్యాయామం ఆమె దినచర్య లో భాగంగా ఉంటుంది. ఇక కొన్నేళ్ల క్రితమే మాంసాహారం మానేశారు. అందం, ఆరోగ్యం కోసం ఆర్గానిక్ ఫ్రూట్స్ , కూరగాయలు మాత్రమే తింటారు. వాటిలో కొన్ని తన సొంత పెరటిలో స్వయంగా పెంచుకుంటారు. 
కాగా సమంత ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటారు. తాజాగా సమంత జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియో షేర్ చేశారు. ఫిట్నెస్ ట్రైనర్ సమక్షంలో సమంత కఠిన కసరత్తులు చేస్తూ.. చెమటలు చిందిస్తుంది. డబ్బులు, ఫేమ్ ఉన్నప్పటికీ కెరీర్ కోసం సమంత ఇలా కష్టపడుతున్నారు. మరి గ్లామర్ ఇండస్ట్రీలో ఫిట్నెస్ చాలా అవసరం. బరువు పెరిగి షేప్ కోల్పోతే దర్శక నిర్మాతలు పక్కనపెట్టేస్తారు.  

అందుకే సమంత అంత సన్నగా ఉన్నప్పటికీ వ్యాయామం ఆపడం లేదు. ఇక విడాకుల తర్వాత సమంత కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టారు. బాలీవుడ్ లో ఎదగడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ తో సమంత హిందీ ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. కాబట్టి సమంతకు అక్కడ కొంత ఇమేజ్ ఏర్పడింది. ఇక ఐటెం సాంగ్ లో కూడా నటించిన సమంత సంచలనానికి తెరలేపారు. పుష్ప మూవీలో సమంత బోల్డ్ మాస్ అటైర్ ఫ్యాన్స్ తో పాటు అందరికీ షాక్ ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios