దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కుతున్న పీరియడ్ మూవీ విరాటపర్వం 1992. నక్సలిజం నేపథ్యంలో ఈచిత్రం తెరకెక్కుతుండగా... సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. నేడు రానా పుట్టినరోజు నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నక్సలైట్ గెటప్ లో ఉన్న రానా...  చేతిలో గన్ పట్టుకొని సీరియస్ గా వస్తున్న లుక్ ఆసక్తి రేపుతుంది. ఈ పోస్టర్ పై సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సినిమాలో హీరోకి సమానమైన కీలక రోల్ నాది. అందుకే పోస్టర్ లో రానా పేరుతో పాటు నా పేరుకూడా వేశారు. రానా గొప్ప మనసు కారణంగానే ఇది సాధ్యం అయ్యిందని సాయి పల్లవి అన్నారు. సాధారణంగా స్టార్ హీరో హోదాలో ఉన్న హీరోలు ఎవరైనా... హీరోయిన్ పేరు పోస్టర్ లో తమ పేరుతో పాటు వేయడానికి ఇష్టపడరు.కానీ సినిమాలో పాత్రల ప్రాధాన్యం ఆధారంగా సాయి పల్లవి పేరు పోస్టర్ లో వేయించడం, అరుదైన విషయమే. 

యధార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి సైతం నక్సలైట్ గా కనిపించనున్నారు. మలయాళ బ్యూటీ నివేదా పేతురాజ్ కూడా ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ చివరి దశలో ఉండగా... వచ్చే ఏడాది విడుదల కానుంది.