మెగా కోడలు ఉపాసనకు కొణిదెల యువర్ లైఫ్ పేరుతో హెల్త్, ఫుడ్ అండ్ ఫిట్నెస్ కి సంబంధించి ఓ వెబ్ పోర్టల్ నిర్వహిస్తున్నారు. దీనికి ప్రచారం కోసం ఆమె టాలీవుడ్ సెలెబ్రిటీలను గెస్ట్స్ గా పిలుస్తున్నారు. అతిథులుగా విచ్చేసిన సెలెబ్రిటీలు ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన వంటకాలను ఎలా చేయాలో వండి చూయిస్తున్నారు. 

ఆ మధ్య ఈ ప్రోగ్రాం కి అతిథిగా సమంత రావడం జరిగింది. తాజాగా హీరోయిన్ రష్మిక మందాన అథితిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రష్మిక చికెన్ పుట్టు కర్రీ ఎలా చేయాలో చేసి చూపించారు. ఈ క్రమంలో హోస్ట్ ఉపాసన రష్మిక ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ గురించి అడిగి తెలుసుకున్నారు. 

కర్ణాటకలోని కోర్గి సామాజిక వర్గానికి చెందిన రష్మిక పందిమాంసం ఇష్టంగా తింటారట. ఆ సామాజిక వర్గ ప్రజల సాంప్రదాయ వంటకం పంది మాసం అట. పంది మాంసం నిప్పులపై కాల్చుకు తింటుంటే చాలా రుచిగా ఉంటుందని రష్మిక చెప్పారు. అలాగే వారు ఇంటిలోనే వైన్ తయారు చేసుకుంటారట. ఆహారం తరువాత రెండు గ్లాసుల వైన్ తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుందని రష్మిక తెలియజేశారు. 

ప్రస్తుతం రష్మిక బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. దర్శకుడు సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.