మాజీ హీరోయిన్ మరియు ప్రస్తుత ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. కొద్దిరోజుల క్రితం ఆమెకు మరియు కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు డాక్టర్స్ నిర్ధారించారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స కోసం చేరడం జరిగింది. ఐతే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నాగ్ పూర్ లోని ఓ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. నేడు ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

2011లో పెళ్లి తరువాత సినిమా కెరీర్ కి గుడ్ బై చెప్పిన నవ్ నీత్ కౌర్ పొలిటీషియన్ గా మారడం జరిగింది. ఆమె సొంత రాష్ట్రం మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఆమె 2019 ఎన్నికలో ఎంపీ గా విజయం సాధించారు. పొలిటికల్ గా దూసుకుపోతున్న నవ్ నీత్ కౌర్ కోవిడ్ బారిన పడడం ఆమె ఫ్యాన్స్ ని విచారానికి గురి చేసింది.  

2004లో దర్శన్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా మారిన నవ్ నీత్ కౌర్ తెలుగు మరియు తమిళ, కన్నడ భాషలలో 25కి పైగా సినిమాలలో నటించారు. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సోసియో ఫాంటసీ చిత్రం యమదొంగ సినిమాలో ఆమె ఎన్టీఆర్ తో ఓ పాటకు చిందేశారు. కోవిడ్ నుండి కోలుకొని ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.