ఇలా ఫేమస్ అయ్యిందో లేదో.. అలా బెదిరింపులు కూడా స్టార్ట్ అయ్యాయి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు. సెలబ్రిటీలకు ఇలాంటి తిప్పలు తప్పవు.. కాని మృణాల్ కు కెరీర్ బిగినింగ్ లోనే ఈ ఇబ్బందులు తప్పడం లేదు.
సెలబ్రిటీల లైఫ్ చూడటానికే కలర్ ఫుల్ గా ఉంటుంది. కాని దాని వెనుకు ఉండే ఇబ్బందులు చాలా మందికి తెలియవు. సెలబ్రిటీ కాబట్టి సామాన్యుల కళ్లు మొత్తం వారిమీదే ఉంటాయి. అంతే కాదు హీరోయిన్లను అయితే ఎలా ఇబ్బంది పెట్టాలా అని చూసేవారు కూడా ఉంటారు. అలాంటి అనుభవాన్ని ఫేస్ చేస్తుంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.
సెలబ్రిటీలను పనిగట్టుకుని ఏడిపించేవారు ఉంటారు. వీరిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుంటారు. వీరి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వారిని వేధింపులకు గురి చేస్తుంటారు. దీనికోసం సోషల్ మీడియాను బాగా వాడుకుంటారు. పెద్దవాళ్ల ఖాతాలను హ్యాక్ చేయడం వంటివి ఎక్కువగా చూస్తూనే ఉంటాం. తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు లోనయ్యారు.
సీతారామం సినిమాతో ఓవర్ నైట్ టాలీవుడ్ స్టార్ గా మారింది మృణాల్. బాలీవుడ్ లో అప్పటికే కాస్త ఇమేజ్ ఉన్నా.. ఈసినిమా మాత్రం ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకుంది బ్యూటీ. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ చేసిన సీతామహాలక్ష్మి క్యారెక్టర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా తరువాతే మృణాల్ కు బాగా ఫాలోయింగ్ పెరిగింది.
ఇక ప్రస్తుతం కొన్ని సమస్యల్లో చిక్కుకుని ఉంది మృణాల్. ఆమె ఈ మెయిల్ అకౌంట్ ను హ్యాక్ చేశారట సైబర్ నేరగాళ్లు. అంతేకాకుండా బెదిరింపులు కూడా చేస్తున్నారట. ఈ విషయాన్ని ఈ హీరోయిన్ స్వయంగా వెల్లడించింది. అంతే కాదు ఓవీడియోను కూడా ఆమె శేర్ చేసింది.
మృణాల్ మాట్లాడుతూ.. నా ఈ-మెయిల్ ఖాతా హ్యాక్ చేశారు. దీని ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా వ్యక్తిగత సమాచారం, నా సినిమా స్క్రిప్ట్‌లన్నీ అందులోనే ఉన్నాయి. అంటూ బాధపడింది. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ బయటకు వచ్చింది. అప్పటి వరకూ.. మేటర్ సీరియస్ అనుకున్నారు అంతా.. కాని ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ వీడియో రానా నాయుడు ప్రమోషన్ కోసం చేసింది బ్యూటీ.
ఈమెయిల్ హ్యాక్ అయితే దాని నుంచి ఎలా బయట పడాలో తెలియాలంటే రానా నాయుడు చూడండి అంటూ చెప్పుకొచ్చింది మృణాల్. వెంకటేష్, రానా నటించిన రామానాయుడు సెరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సిరిస్ కు ప్రమోషన్ చేయడం కోసం బ్యూటీ ఇలా చేసింది. ఇలా ఈమె చేయడం కొత్తేం కాదు.. గతంలో కూడా ప్రమోషన్లలో భాగంగా జాన్వీకపూర్ తో కూడా వీడియో చేయించింది. అయితే ఈ విషయంలో కొంత మంది నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తుంటే.. మరికొంత మంది మాత్రం మృణాల్ ను విమర్షిస్తున్నారు.
ఇక ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ.. తాజాగా నానిహీరోగా తెరకెక్కబోతున్న ఆయన 30వ సినిమాలోనూ నటిస్తోంది. అటు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. మరి ఆమె తరువాత సినిమాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి మరి.
