ఇరానీ నటి మందాన కరిమీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాత తనను మానసికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది. శృంగార తార సన్నీలియోనీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'కోకో కోలా' చిత్రంలో ప్రస్తుతం మందనా నటిస్తున్నారు. కోకా కోలా చిత్ర నిర్మాత మహేంద్ర ధరివాల్‌ తనని మానసికంగా వేధించాడని మందాన కరీమీ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. షూటింగ్ సెట్స్ లో ఆయన ప్రవర్తన తననను ఇబ్బంది పెట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

మందాన కరిమీ మాట్లాడుతూ '' గత ఏడాది నుండి కోకో కోలా' చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్ర యూనిట్ తో నేను  మొదటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నిర్మాత మహేంద్ర పురుష పక్షపాతి. కోపం, అహంకారం ఎక్కువ. అయితే దీపావళి ముందురోజు రాత్రి ఈ సినిమాకి సంబంధించి నా షూటింగ్‌ చివరిరోజు. అదే రోజు నిర్మాత ప్రవర్తన చూసి నేనెంతగానో కంగారుపడ్డా. సీన్స్‌ ఇంకొన్ని బ్యాలెన్స్‌ ఉన్నాయని.. కాబట్టి మరో గంట సెట్‌లోనే ఉండాలని నిర్మాత చెప్పారు. అయితే వేరే మీటింగ్స్‌ ఉండడం వల్ల నాకు కుదరదని సమాధానమిచ్చాను. దానికి ఆయన సరే అన్నారు. అనంతరం షూటింగ్‌ పూర్తి చేసుకుని దుస్తులు మార్చుకోవడానికి క్యారీవాన్‌లోకి వెళ్లాను. అలా నేను వెళ్లిన కొంత సమయానికే నిర్మాత నా క్యారీవాన్‌లోకి ప్రవేశించి నన్ను తిట్టడం ప్రారంభించారు.'

మందాన కరీమీ ఇంకా మళ్లాడుతూ...డ్రెస్ చేంజ్ చేసుకోవాలి సర్ బయట ఉండండి. వచ్చి మాట్లాడతాను. అని చెప్పినప్పటికీ ఆయన వినలేదు. 'నువ్వు ఇప్పుడు వెళ్లడానికి వీల్లేదు. మరో గంట సెట్‌లో ఉండమని చెప్పాను కాబట్టి నువ్వు ఉండాలి. ఎందుకంటే నీకు డబ్బులు ఇచ్చిన నిర్మాతని నేను.' అని గట్టిగా కేకలు వేశారు. ఆయన అరుపులు విని అక్కడ ఉన్నవారందరూ నన్ను ఇబ్బందిగా చూశారు. అందరి ముందు కేకలు వేసి ఆయన నన్ను మానసికంగా వేధింపులకు గురి చేశారు. సినీ పరిశ్రమలో నాకు గాడ్‌ఫాదర్‌ లేరు. ఒంటరి మహిళపై వేధింపులకు పాల్పడడం ఎంతవరకూ సమంజసం' అని నటి ఆవేదన వ్యక్తం చేశారు.

మందాన కరీమీ ఆరోపణలు ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. 2015లో వచ్చిన రాయ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మందాన ఆ తరువాత బాగ్ జానీ, మై ఔర్ చార్లెస్ వంటి చిత్రాలలో మందాన కరీమీ నటించారు.