తమిళ హాట్ బ్యూటీ ఆండ్రియా లక్కీ ఛాన్స్ కొట్టేసింది. కొంత మందికి మాత్రమే దొరికే అరుదైన ఛాన్స్ ను ఆమె సాధించింది. యూఏఈ  సెలబ్రిటీలకు మాత్రమే అందించే అరుదైన వీసాను ఆమె అందుకుంది. 

తమిళ హాట్ బ్యూటీ ఆండ్రియా లక్కీ ఛాన్స్ కొట్టేసింది. కొంత మందికి మాత్రమే దొరికే అరుదైన ఛాన్స్ ను ఆమె సాధించింది. యూఏఈ సెలబ్రిటీలకు మాత్రమే అందించే అరుదైన వీసాను ఆమె అందుకుంది. 

తమిళ సినీ ఇండస్ట్రీలో బోల్డ్‌ పాత్రలంటే గుర్తుకు వచ్చేది ఆండ్రియా పేరే. హాట్ సీన్స్ తో.. అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. కార్తీ హీరోగా యుగానికి ఒక్కడు, లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా విశ్వరూపం సినిమాలతో ఈ బ్యూటీ టాలీవుడ్ లో కూడా పరిచయం అయ్యింది. ప్రస్తుతం మిష్కిన్‌ దర్శకత్వం లో పిశాచి 2 సినిమాలో నటిస్తోంది ఆండ్రియా. ఆమెకు రీసెంట్ గా అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గోల్డెన్ వీసా పొందింది తమిళ హాట్‌ బ్యూటీ ఆండ్రియా.

అయితే భారతీయ సినీ తారలకు దుబాయ్‌ ప్రభుత్వం ఈ వీసాను అందజేస్తోంది. తాజాగా ఈ జాబితాలో చేరింది ఆండ్రియా జెరెమియా. ఆదేశపు అధికారి నుంచి ఈ వీసాను అందుకుంది. ఈ సంధర్భంగా యూఏఈ ప్రభుత్వానికి ఆండ్రియా ధన్యవాదాలు తెలిపింది.

View post on Instagram

2019 నుంచి ఈ గోల్డెన్‌ వీసాలతో సెలబ్రిటీల ను సత్కరిస్తోంది దుబాయ్ ప్రభుత్వం. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ల పాటు దుబాయ్ పౌరసత్వం ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్‌ అవుతుంది. ఇటీవలే ఈ గోల్డెన్‌ వీసాను సీనియర్‌ నటి మీనా అందుకున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి ఈ వీసాను పొందగా.. టాలీవుడ్‌ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. 

యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ అందుకున్నారు. తర్వాత బాలీవుడ్‌లో సంజయ్ దత్, సునీల్‌ శెట్టి, సింగర్స్‌ సోనూ నిగమ్‌, నెహా కక్కర్‌, బుల్లితెర హాట్‌ బ్యూటీ మౌనీ రాయ్‌, ఫరా ఖాన్‌, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్‌ కుటుంబం ఈ వీసా పొందింది.

ఇటు సౌత్ నుంచి కూడా ఈ లిస్ట్ పెద్దగానే ఉంది. సౌత్ స్టార్స్ లో మోహన్ లాన్, మమ్ముట్టితో పాటు సింగర్ చిత్ర, హీరోయిన్ త్రిష, దుల్కర్ సల్మాన్, అమలా పాల్ తో పాటు మరికొంత మబంది సౌత్ స్టార్స్ గోల్డెన్ వీసాను అందుకున్నవారిలో ఉన్నారు. అటు ఇతర రంగాల నుంచి కూడా సానియా మీర్జా లాంటివారు యూఏఈ గోల్డెన్ వీసాను అందుకున్న వారిలో ఉన్నారు.