Asianet News TeluguAsianet News Telugu

రూ. 175 కోట్ల ఇంటిలో ప్రియుడితో మకాం పెట్టనున్న పవన్ హీరోయిన్!

సౌత్ ఇండియాకు చెందిన ఓ బిజినెస్ మాన్ తో ఆమె ప్రేమలో పడ్డారట.ముంబైలో ఇక అతనితో ఏకాంతంగా గడపడానికి ఓ లగ్జరీ హౌస్ ని కొన్నారట . ఇక అందమైన అరేబియా సముద్రం కనిపించేలా తీరంలో ఉన్న ఈ ఇంటిని ఎంతో శ్రమించి వెతికిపట్టుకున్నారట జాక్విలిన్.

heroin jacqueline supposed to shift to a luxury house with boyfriend ksr
Author
Hyderabad, First Published Jun 18, 2021, 9:21 AM IST


శ్రీలంక భామ జాక్విలిన్ ఫెర్నాండెజ్ పై తరచుగా అఫైర్స్ రూమర్స్ వస్తూ ఉంటాయి. ఈ హాట్ బాంబ్ గత ఏడాది లాక్ డౌన్ మొత్తం సల్మాన్ ఫార్మ్ హౌస్ లో గడిపేసింది. వందల ఎకరాల్లో ఉన్న ఎస్టేట్ లో ఫుల్ గా క్వారంటైన్ ఎంజాయ్ చేసింది జాక్విలిన్. తాజాగా జాక్విలిన్ ఓ బిగ్ బిజినెస్ మాన్ ని లైన్ లో పెట్టినట్లు సమాచారం అందుతుంది. 


సౌత్ ఇండియాకు చెందిన ఓ బిజినెస్ మాన్ తో ఆమె ప్రేమలో పడ్డారట. ఇక అతనితో ఏకాంతంగా గడపడానికి ఓ లగ్జరీ హౌస్ ని కొన్నారట ముంబై. ఇక అందమైన అరేబియా సముద్రం కనిపించేలా తీరంలో ఉన్న ఈ ఇంటిని ఎంతో శ్రమించి వెతికిపట్టుకున్నారట జాక్విలిన్. ఇంతకీ ఆ ఖరీదైన హౌస్ ధర ఎంతో తెలుసా.. ఏకంగా రూ. 175కోట్లు అట. ఇక ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్ కోసం ఫ్రాన్స్ కి చెందిన ఓ ప్రముఖ సంస్థ రంగంలోకి దిగుతుందట. 


175కోట్ల రూపాయలు కేవలం ఇంటికే వెచ్చించిన ఆ బిజినెస్ మాన్ ఎవరిని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక సాహో చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన జాక్విలిన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. అయితే పవన్ నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రం ద్వారా పూర్తి స్థాయిలో తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయనుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios