హీరోయిన్ భావన లైంగిక వేధింపుల ఉదంతం మలయాళ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. 2017 సంవత్సరంలో షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్న భావనను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న పల్సర్ సునీల్... ఈ సంఘటన వెనుక నటుడు దిలీప్ ఉన్నాడని చెప్పడంతో కలకలం రేగింది.
ఐదేళ్ల క్రితం తనకు జరిగిన దారుణమైన అనుభవం గురించి నటి భావన(Bhavana) మాట్లాడారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసు ఫలితం ఆలోచించకుండా పోరాడతానని చెప్పారు. ఇక తనకు జరిగిన అన్యాయం పట్ల అభిమానులు, సమాజం స్పందించారు. కుటుంబ సభ్యులు, మిత్రులు అండగా నిలబడ్డారు. భావన ఇంకా మాట్లాడుతూ.. నా గౌరవం ముక్కలు చేయబడింది. ఆ సమయంలో నేను ఒంటరి కాదని పబ్లిక్, రెలెటివ్స్ అండగా నిలిచారు, అన్నారు.
ఇక ఈ కేసు విచారణ సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు భావన గుర్తు చేసుకున్నారు. 2020లో దాదాపు 15 రోజులు మార్నింగ్ నుండి ఈవెనింగ్ వరకు కోర్టు దగ్గరే గడపాల్సి వచ్చేది. ప్రతిసారి ఓ లాయర్ క్రాస్ ఎక్సామ్ చేసేవారు. అలాగే సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేశారు కొందరు. సోషల్ మీడియా దాడులు నన్ను మరింత మానసిక వేదనకు గురిచేశాయని భావన తెలియజేశారు.
2017లో నటి భావనను కొందరు దుండగులు కిడ్నాప్ చేయడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేశారు. దీని వెనుక ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ (Dileep)ఉన్నాడని నేరానికి పాల్పడిన ప్రధాన నిందితుల్లో ఒకరు ఒప్పుకున్నారు. ఈ కేసులో దిలీప్ కుమార్ జైలుకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఇక తెలుగులో భావన గోపీచంద్ ఒంటరి, శ్రీకాంత్ కి జంటగా మహాత్మతో పాటు హీరో, నిప్ప్పు వంటి చిత్రాలలో నటించారు. చేసింది తక్కువ చిత్రాలే అయినా భావన టాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.