యంగ్ హీరోయిన్ రక్షిత అలియాస్ ఆనంది కో డైరెక్టర్ ని పెళ్ళాడి షాకిచ్చారు. గురువారం రాత్రి ఆనంది సొంత ఊరు వరంగల్ లో ఈ వివాహం జరిగింది. ఆనంది పెళ్లాడిన అబ్బాయి పేరు సోక్రటీస్ అని తెలుస్తుంది. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరగడం విశేషం. ఆనంది, సోక్రటీస్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాహ విషయం బయటికి వచ్చింది. 

ఐతే ఆనంది, సోక్రటీస్ లది పెద్దలు కుదిర్చిన వివాహం అని సమాచారం. దర్శకుడు మారుతీ 2012లో తెరకెక్కించిన ఈ రోజుల్లో మూవీతో రక్షిత వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత బస్ స్టాప్ 2 అనే ఓ చిత్రం చేయడం జరిగింది. టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె కోలీవుడ్ కి వెళ్లడం జరిగింది. 

కోలీవుడ్ కి వెళ్ళాక రక్షిత తన పేరు ఆనందిగా మార్చుకుంది. అక్కడ కొన్ని విజయవంతమైన చిత్రాలతో ఆమె నటించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జాంబి రెడ్డి చిత్రంలో రక్షిత కూడా ఒక హీరోయిన్ గా చేయడం జరిగింది. హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న సమయంలోనే రక్షిత పెళ్లి చేసుకొని సెటిలైపోయారు.