నాచురల్ స్టార్ నాని, సుధీర్ ల యాక్షన్ ఎంటరైనర్ వి మూవీ విడుదలై దాదాపు వారం కంప్లీట్ అవుతుంది. ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ ధర చెల్లించి ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకుంది. నాని సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ చిత్రంలో మరో హీరో సుధీర్ కీలకమైన పోలీస్ పాత్ర చేశారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. ఇక నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటించడం జరిగింది. 

కాగా ఈ చిత్రంలో తన రోల్, పాత్ర నిడివి, వి మూవీ చేయడానికి గల కారణాలు హీరోయిన్ అదితిరావ్ హైదరి తెలియజేశారు. వి మూవీలో హీరోయిన్ గా చేయడానికి మొదటి కారణం టీమ్ సభ్యులు అని ఆమె అన్నారు. వి మూవీ కోసం అద్భుతమైన టీమ్ పనిచేసింది. ముఖ్యంగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి సార్ అంటే నాకు చాలా అభిమానం. ఆయన ఓ అందమైన మూవీతో నన్ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు. 

వి మూవీలో నేను చేసిన సహీబ పాత్ర పరిధి చిన్నదైనా చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సహీబ పాత్ర పరిధి తక్కువైనా కథలో ఆమె పాత్ర కీలకం, అలాగే మోహన కృష్ణ దర్శకుడు కాకున్నా ఈ రోల్ చేసే దానిని కాకపోవచ్చు. ఏదిఏమైనా వి మూవీలో నటించడం అదృష్టంగా భావిస్తున్నారు. వి మూవీలో అదితి హీరో నాని భార్య పాత్ర చేశారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, థమన్ బీజీఎమ్, అమిత్ త్రివేది పాటలు అందించారు.