నటుడు విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని అతడి తండ్రి జికె రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించాడు. హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త కూతురు అనీషాతో విశాల్ పెళ్లి జరగబోతున్నట్లు చెప్పారు. 

నటుడు విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని అతడి తండ్రి జికె రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించాడు. హైదరాబాద్ కి చెందినవ్యాపారవేత్త కూతురు అనీషాతో విశాల్ పెళ్లి జరగబోతున్నట్లు చెప్పారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎప్పుడైతే విశాల్ పెళ్లి వార్త బయటకొచ్చిందో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అతడు పెళ్లి చేసుకోబోయేది ఈమెనే అంటూ ఓ అమ్మాయి ఫోటోని కూడా పోస్ట్ చేశారు కొందరు ఔత్సాహికులు.

అది కాస్త వైరల్ అయింది. ఈ విషయంపై స్పందించిన విశాల్ అందులో నిజం లేదని తన పెళ్లి వివరాలు స్వయంగా అభిమానులకు చెబుతానని అన్నాడు. ఎట్టకేలకు విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆమె వివరాలు తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారు నెటిజన్లు.

ఆమె మరెవరో కాదూ.. 'అర్జున్ రెడ్డి' సినిమాలో హీరో స్నేహితుల్లో ఒకరిగా నటించిన కీర్తినే ఈ అనీషా. వ్యాపారవేత్త విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె ఆమె. 'అర్జున్ రెడ్డి' తో పాటు 'పెళ్లిచూపులు' సినిమాలో కూడా నటించింది. విశాల్ లాంటి వ్యక్తిని తన జీవితభాగస్వామిగా చేసుకోవడం సంతోషంగా ఉందని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. 

View post on Instagram