విద్యార్ధిని ఆత్మహత్యపై విశాల్ కామెంట్!

First Published 6, Jun 2018, 6:13 PM IST
Hero Vishal Reacts On The Tragic Incident Of Jasleen Kaur's Suicide
Highlights

మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ లో మంచి ర్యాంక్ రాలేదని హైదరాబాద్ కు చెందిన జస్లీన్ కౌర్ 

మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ లో మంచి ర్యాంక్ రాలేదని హైదరాబాద్ కు చెందిన జస్లీన్ కౌర్ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఈమెతో పాటు పలువురు స్టూడెంట్స్ వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన విశాల్.. 

''నీట్ లోర్యాంక్ రాలేదని జస్లీన్ కౌర్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం విని చాలా బాధ అనిపించింది. నీట్ వల్ల ఒకరి తర్వాత ఒకరిగా చాలా మందిని కోల్పోయాం. దేశ భవిష్యత్తు విద్యార్థుల మీదే ఆధారపడి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థుల కలలు ఎండమావి గానే మిగిలిపోతాయి. విద్యార్థులు నీట్ పరీక్ష ని పబ్లిక్ సర్వీస్ పరీక్ష లాగే భావించి సాధించే వరకు ప్రయత్నించాలి. విద్యార్ధులకి సహాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.నీట్ పరీక్ష ని భవిష్యత్తులో కొనసాగించేలా అయితే ప్రభుత్వమే విద్యార్ధులకి కోచింగ్ తో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేలా శిక్షణ తరగతులు నిర్వహించాలి. పరిస్థితి ఇలానే ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో ని పేద విద్యార్ధులకి వైద్య విద్య అనేది కలగానే ఉండిపోతుంది'' అని అన్నారు. 
 

loader